Wayanad Landslide Tragedy: కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విలయం వందలాది కుటుంబాల్లో తీరని బాధను నింపింది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో శనివారం అర్థరాత్రి వరకు 219 మంది మృత దేహాలు, 143 శరీర భాగాలను వెలికి తీసామని అధికారులు వెల్లడించారు. ఇంకా 206 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు.
ఇదిలా ఉంటే మరో వైపు వయనాడ్ బాదితులకు సాయం చేసేందుకు దేశ వ్యాప్తంగా పలువురు వ్యక్తులు, సంస్థలు విరాళాలు అందజేస్తున్నారు. కొండ చరియలు విరిగిపడి తీవ్రంగా నష్టపోయిన వయనాడ్‌ను పునర్నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి యూడీఎఫ్ ఆదివారం తెలిపింది.