E-Paper
Advertisement

NTR 30:NTR 30 లాంచింగ్ డేట్.. రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్

NTR 30:NTR 30 లాంచింగ్ డేట్.. రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్
Advertisement

NTR 30:యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ కోసం కాదండోయ్‌.. సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కోసం. అస‌లెప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా వెన‌క్కి వెళుతూనే ఉంది. ఆ మ‌ధ్య పాన్ ఇండియా ఆడియెన్స్‌ను మెప్పించేలా స్క్రిప్ట్ త‌యారు కావ‌టంలో NTR 30 లేట్ అవుతూ వ‌చ్చింది. పోనీ ఫిబ్ర‌వ‌రి 24న సిమాను లాంచంన‌గా ప్రారంభిద్దాం అని అనుకున్నారు. అప్పుడు తారక‌ర‌త్న చ‌నిపోయారు. దీంతో మ‌ళ్లీ సినిమాను లాంచింగ్ వాయిదా ప‌డింది.

అయితే తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు NTR 30 పూజా కార్య‌క్ర‌మాల‌ను మార్చి 18న చేయ‌బోతున్నార‌ట‌. ఇంత గ్యాప్ ఎందుక‌నే అనుమానం రాక మాన‌దు. మార్చి 12న ఆస్కార్ వేడుక‌లకు ఎన్టీఆర్ వెళ్లాల్సి ఉంది. అక్క‌డ నుంచి వ‌చ్చిన త‌ర్వాత సినిమాను కూల్‌గా స్టార్ట్ చేయ‌వ‌చ్చున‌నేది మేక‌ర్స్ ఆలోచ‌న‌. అలాగే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తార‌ట‌. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. ఇక అధికారిక ప్ర‌క‌ట‌న మాత్ర‌మే మిగిలింద‌నేది స‌మాచారం.

Advertisement

RRR వ‌చ్చి దాదాపు ఏడాది కావ‌స్తుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు త‌మ అభిమాన హీరో సినిమా కోసం ఎగ్జ‌యిట్మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ 30ని సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ కంతా పూర్తి చేయాల‌ని కొర‌టాల శివ‌కు కండీష‌న్ పెట్టార‌ట మ‌న నంద‌మూరి నాయ‌కుడు. అందుకు కార‌ణం త‌న త‌దుప‌రి సినిమాను ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

Manchu Manoj Marriage: మంచు మ‌నోజ్ పెళ్లి వ‌చ్చే వార‌మే!

Advertisement

Project K: ‘న భూతో న భవిష్యతి’.. ‘ప్రాజెక్ట్‌-కె’ గురించి నిర్మాత క్లారిటీ.. మ్యూజిక్ డైరెక్టర్ ఛేంజ్..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×