BigTV English

Women’s T20 World Cup : ఆస్ట్రేలియా టైటిల్ సిక్సర్.. ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై విజయం..

Women’s T20 World Cup : ఆస్ట్రేలియా టైటిల్ సిక్సర్.. ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై విజయం..

Women’s T20 World Cup : మహిళల టీ20 వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆరోసారి ఈ ట్రోఫిని కైవసం చేసుకుంది. మొత్తం 7 ఐసీసీ టోర్నీలు జరగగా ఆసీస్ ఆరు టైటిళ్లు గెలవడం విశేషం. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో బెత్ మూనీ అదరగొట్టింది. గార్డ్ నర్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.


తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. బెత్ మూనీ 74 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆలౌరౌండర్ గార్డ్ నర్ ( 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో దక్షిణాఫ్రికా ముందు మంచి లక్ష్యాన్ని ఆసీస్ నిర్దేశించింది. సఫారీ జట్టులో షబ్నిమ్, కాప్ చెరో రెండు వికెట్లు తీసి ఆసీస్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు.

157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు చివరి వరకు పోరాడినా విజయం సాధించలేకపోయింది. ఓపెనర్ లారా వోల్వార్ట్ మాత్రమే 61 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసింది. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో సఫారీ జట్టు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో19 పరుగుల తేడాతో ఆసీస్ జయభేరి మోగించి వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. గార్డ్ నర్ , మెగాన్ షట్, డార్సీ బ్రౌన్ తలో వికెట్ తీయడమేకాకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పరుగుల కోసం శ్రమించాల్సి వచ్చింది.


అజేయ హాఫ్ సెంచరీతో రాణించిన బెత్ మూనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అటు బ్యాటింగ్ , ఇటు బౌలింగ్ లో రాణించిన ఆల్ రౌండర్ ఆష్లీ గార్డ్ నర్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. మొత్తం మీద మహిళల క్రికెట్ లో ఆసీస్ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. టీ20 వరల్డ్ కప్ లో ఒక్క ట్రోఫి మినహా మిగతా అన్నిసార్లు ఆ జట్టే విజేతగా నిలిచింది. 1999-2007 మధ్య ఆసీస్ పురుషుల జట్టు ఇలాగే రాణించింది. వరుసగా మూడు వన్డే వరల్డ్ కప్ లు గెలిచింది. ఇప్పుడు మహిళల జట్టు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయిస్తోంది. మిగతా జట్లు కనీసం ఆసీస్ కు పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి.

ICC Rankings:ఐసీసీ ర్యాంకుల్లో జడేజా, అశ్విన్ అదుర్స్

Preethi : మెడికో ప్రీతి కన్నుమూత.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు..

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×