E-Paper
Advertisement

Update on Devara Movie: ‘దేవర’ ట్రీట్ అదిరింది బాసు.. కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదుగా..!

Update on Devara Movie: ‘దేవర’ ట్రీట్ అదిరింది బాసు.. కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదుగా..!
Advertisement
ntr Devara movie update
Devara

Latest Update on NTR’s Devara Movie: ఏదైనా ఒక పాత్రలో లీనమైపోవాలంటే దానికి ప్రత్యేక టాలెంట్ ఉండాలి. ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలగాలి. నటనలో నవరసాలు పండించాలి. అప్పుడు మాత్రమే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వీటన్నింటిని చేయగలిగే అతి తక్కువ మంది నటులలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు చెప్పినవన్నీ ఎన్టీఆర్‌లో చూశాం. ఇచ్చిన పాత్రకు తగిన న్యాయం చేస్తాడు. యాక్టింగ్, డ్యాన్స్‌తో ఉర్రూతలుగిస్తాడు. ‘ఆర్ఆర్ఆర్’లో ఆయన నటనకు ఫిదా అవ్వనివారుండరు. యావత్ ప్రపంచ సినీ ప్రియులు సైతం ఆయన యాక్టింగ్‌కు సలాం కొట్టారు.

అంతటి గొప్ప నటుడు ఎన్టీఆర్. ఇప్పుడీ హీరో మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

రెండు పార్టులుగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి తరచూ ఏదో ఒక అప్డేట్ వస్తూ సినీ అభిమానుల్లో జోష్ నింపుతుంది. ఈ మూవీ తాజా షెడ్యూల్ గోవాలో పూర్తి చేస్తుకుంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌పై ఒక సాంగ్, యాక్షన్ సీక్వెన్స్‌ను మేకర్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

Also Read: రజినీకాంత్ – లోకేష్ కాంబో.. టైటిల్ ఇదే..!

Advertisement

ఫస్ట్ పార్ట్‌కు సంబంధించి క్రూషియల్ షెడ్యూల్ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరొక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్, టాకీ పార్ట్ మొత్తాన్ని క్లియర్ చేసే పనిలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏప్రిల్‌లో వీటిని పూర్తి చేసేప్లాన్‌లో దర్శకుడు కొరటాల ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి చేసుకోనుందని టాక్ నడుస్తోంది.

ఇందులో ఇంకా మూడు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిని కూడా జూలైలో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి అక్టోబర్ 10న రిలీజ్ చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×