BigTV English

Rajinikanth – Lokesh Kanagaraj Combo: రజినీకాంత్ – లోకేష్ కాంబో.. టైటిల్ ఇదే..!

Rajinikanth – Lokesh Kanagaraj Combo: రజినీకాంత్ – లోకేష్ కాంబో.. టైటిల్ ఇదే..!
Rajinikanth
Rajinikanth

Rajinikanth Lokesh Kanagaraj Movie Title Buzz: జైలర్ మూవీతో రజినీకాంత్ బ్లాక్ బస్టర్ కంబ్యాక్ అందుకున్నాడు. అప్పటి వరకు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రజనీకి ఈ సినిమా మంచి ఆకలిని తీర్చింది. దాదాపు రూ.600 కోట్లు రాబట్టి అబ్బురపరచింది. దీంతో ఎన్నో ఏళ్ల కష్టం ఒక్కసారిగా సంతోషాన్నిచ్చింది. అనంతరం రజనీకాంత్ వరుస చిత్రాలతో బిజీగా మారిపోయాడు. ఇటీవల లాల్ సలామ్ మూవీలో అతిధి పాత్రలో నటించి అదగొట్టేశాడు. కానీ ఆ మూవీ బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా మారింది.


ఇక ఇప్పుడు తన కెరీర్‌లో మరో చిత్రాలను లైన్‌లో పెట్టాడు. తలైవా 170, తలైవా 171 చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఈ తలైవా 170వ చిత్రానికి వేట్టయాన్ అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అలాగే తలైవా 171 మూవీకి యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో ఫుల్ హైప్ ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ మూవీపై అందరిలోన ఆసక్తి నెలకొంది.

లోకేష్ ఈ చిత్రాన్ని సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తీయనున్నాడా? లేక మరేదైనా కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాడా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి రజనీ లుక్ రిలీజ్ అయి ప్రేక్షకాభిమానుల్లో మరింత బజ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా సూపర్ స్టార్ రజినీ – లోకేష్ కాంబోలో మొదటి సినిమా కావడంతో ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుంది.


Also Read: ఫ్యామిలీ స్టార్ ట్విట్టర్ రివ్యూ.. విజయ్‌కి గట్టి దెబ్బ పడినట్లు ఉందే..?

విక్రమ్‌ మూవీతో ఎన్నో రికార్డులను సృష్టించిన లోకేష్.. రజినీ మూవీకి కూడా ఆ రేంజ్ హిట్‌ని అందిస్తాడని అంతా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మూవీ ఏ జానర్‌లో తెరకెక్కబోతుందో ఒక అప్డేట్ బయటకొచ్చింది. ఇది బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కబోతుందని టాక్ నడుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పలు టైటిళ్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ చిత్రానికి గానూ ‘తలైవా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తారంటూ ఆ మధ్య వార్తలు జోరుగా సాగాయి. అయితే ఇప్పుడు మరొకవార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ‘కళుగు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని దర్శకుడు లోకేష్ ఆలోచిస్తున్నాడట. అన్ని భాషల్లోనూ ఇదే టైటిల్‌తో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘కళుగు’ అంటే ‘గద్ద’ అని అర్థమట. ఇకపోతే ఈ మూవీకి సంబంధించిన అసలు టైటిల్‌ను ఈ నెల 22న అఫీషియల్‌గా ప్రకటించే అవకాశముందని అంటున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×