E-Paper
Advertisement

Jr Ntr Brother in law: ఎన్టీఆర్ బావ మ‌రిది కొత్త సినిమా.. ప్రొడ్యూస‌ర్ ఫిక్స్‌

Jr Ntr Brother in law: ఎన్టీఆర్ బావ మ‌రిది కొత్త సినిమా.. ప్రొడ్యూస‌ర్ ఫిక్స్‌
Advertisement
Jr Ntr Brother in law

సినీ ఇండ‌స్ట్రీలో న‌ట వార‌సులు ఎంట‌ర్ కావ‌టం అనేది కామ‌న్‌గా జ‌రిగే విష‌య‌మే. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరో ఉంటే వారి రిలేటివ్స్ కూడా చిత్ర సీమలోకి రావ‌టం జ‌రుగుతుంది. ఈ రెండో కోవలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌టానికి రెడీ అయిపోతున్నాడు ఎన్టీఆర్ బావ మ‌రిది నార్నే నితిన్‌. ఈ కుర్రాడిని హీరోగా పెట్టి ఓ ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత సినిమా చేయ‌టానికి రెడీ అయిపోతున్నాడు. ఆ నిర్మాత ఎవ‌రో కాదు.. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ.

వైవిధ్య‌మైన సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ ఓ వైపు భారీ చిత్రాల‌తో పాటు చిన్న సినిమాల‌ను కూడా చేస్తున్నారు నిర్మాత సూర్య దేవ‌ర నాగ‌వంశీ. ఆ కోవ‌లో ఇప్పుడు నార్నే నితిన్‌తో ఓ సినిమా చేయ‌టానికి రెడీ అయిపోయార‌ట‌. ఇప్పుడు క‌థాన్వేష‌ణ జ‌రుగుతుంద‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై మ‌రింత క్లారిటీ వ‌స్తుంద‌ని సినిమా ప‌రిశ్ర‌మలోని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల టాక్‌.

Advertisement

ఇదంతా బాగానే ఉంది. అయితే ఇప్ప‌టికే నితిన్ నార్నే హీరోగా రెండు సినిమాల‌ను చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అందులో ఒక‌టి స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ శ్రీ శ్రీ రాజావారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్ కూడా విడుద‌లైంది. త‌ర్వాత తేజ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం 1.1లోనూ నితిన్ నార్నే హీరోగా న‌టిస్తార‌నే టాక్ వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు ఏమ‌య్యాయో తెలియ‌వు కానీ.. ఇప్పుడు సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు షురూ అవుతున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×