E-Paper
Advertisement

OG Movie: దాదాపు రూ.100 కోట్లు.. అదిరా OG రేంజ్.. ?

OG Movie: దాదాపు రూ.100 కోట్లు.. అదిరా OG  రేంజ్.. ?
Advertisement

OG Movie:పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇక సినిమాల్లో కనిపించడం కష్టమే. అవును మీరు వింటుంది నిజమే. ఎమ్మెల్యే అయ్యాక పవన్ సినిమాలకు దూరం కానున్నాడట. అందుకే ఇప్పుడు పవన్ నటిస్తున్న సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్.

ఇప్పటికే హరిహరవీరమల్లు షూటింగ్దాదాపు ఫినిష్ కావొస్తుంది. అంతేకాకుండా ఓటిటీ డీల్ కూడా జరిగిపోయింది. అమెజాన్ ఈ సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడమే తరువాయి. ఈ సినిమా కాకుండా OG సగం షూటింగ్ ను ఫినిష్ చేసుకుంది. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపిస్తున్నాడు.

Advertisement

ఇక సెప్టెంబర్ 27 న ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, ఈ మధ్య OG వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు కారణం.. OG ఓటిటీ హక్కులను ఏ సంస్థ కొనుగోలు చేయకపోవడమే అని టాక్. ఆ సమయంలో ఓటిటీ స్లాట్స్ లేకపోవడంతో OG ని కొనుగోలు చేయలేకపోయినట్లు వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా OG ఓటిటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ తన్నుకుపోయిందని తెలుస్తోంది. అది కూడా చిన్నా చితకా అమౌంట్ తో కాదు. అక్షరాలా.. రూ. 92 కోట్లు.. అంటే దాదాపు రూ. 100 కోట్లకు దగ్గరలో అన్నమాట. పవన్ కెరీర్ లోనే ఇంత హయ్యెస్ట్ రేటు ఏ సినిమాకు రాలేదు. దీంతో ఇదిరా OG రేంజ్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎప్పుడు ఓటిటీకి వస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×