E-Paper
Advertisement

Taapsee Pannu : అవకాశాల కోసం ఎదురుచూసే వారికి రావు

Taapsee Pannu : అవకాశాల కోసం ఎదురుచూసే వారికి రావు
Advertisement
Taapsee Pannu

Taapsee Pannu : సౌత్‌లో హీరోయిన్లుగా అడుగుపెట్టి.. ఆ తర్వాత నార్త్‌కు వెళ్లి అక్కడ క్రేజ్ సంపాదించుకొని సెటిల్ అయినవారు చాలామంది ఉన్నారు. సౌత్‌లో కంటే బాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నవ వారూ ఉన్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత చాలామంది హీరోయిన్లకు ముక్కుసూటిగా మాట్లాడడం అలవాటు అవుతుంది. తాప్సీకి కూడా అదే అలవాటు అయ్యింది. ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఫైర్‌బ్రాండ్‌లాగా దూసుకుపోతున్న తాప్సీ.. తాజాగా మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

Advertisement

తాప్సీ పన్ను.. మోడల్ నుండి హీరోయిన్‌గా మారింది తెలుగు సినిమాలతోనే. చేసిన సినిమాలు హిట్ అయినా కూడా తాప్సీకి మెల్లగా తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో తను హిందీలో చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడం మొదలుపెట్టాయి. దాంతో పాటు తాప్సీ నటనకు అక్కడి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇలాంటి పాత్రలు చేయాలంటే తాప్సీనే కరెక్ట్ అని అనుకోవడం మొదలుపెట్టారు మేకర్స్. అయినా కూడా అప్పుడప్పుడు ప్రేక్షకుల తీరుతో, మేకర్స్ తీరుతో తాప్సీకి మనస్పర్థలు వస్తూ ఉంటాయి.

టాలీవుడ్‌పైనే కాదు.. బాలీవుడ్‌పై కూడా అవకాశం దొరికినప్పుడల్లా తాప్సీ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. బాలీవుడ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ లాగా తాప్సీ కూడా కాంట్రవర్సీలో ముందుటుంది. ఎవరైనా ఎదురుప్రశ్న అడిగితే.. అనిపించి చెప్పేశాను అని సులువుగా సమాధానం ఇస్తుంది. అంతే కాకుండా మీడియాతో తాప్సీ గొడవలకు దిగిన సందర్భాలు అయితే లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. అలాంటి తాప్సీ.. తాజాగా ప్రియాంక చోప్రా అన్న మాటలకు పరోక్షంగా సపోర్ట్ చేస్తూ.. కామెంట్స్ చేసింది.

Advertisement

ఒక పాత్రలో ఏయే పాత్రల్లో ఎవరు నటించాలి అనేది కొందరు స్టార్లు డిసైడ్ చేస్తారు అని చెప్పుకొచ్చింది తాప్సీ. క్యారెక్టర్‌కు సూట్ అయ్యే వారిని, ప్రతిభ ఉన్నవారిని కాకుండా తమ స్నేహితులను, ఏజెన్సీ వారిని క్యాస్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారని సెన్సేషనల్ ఆరోపణలు చేసింది. బాలీవుడ్‌లో ఫేవరెటిజం అనేది ఎక్కువగా ఉంటుందని, అవకాశాల కోసం కష్టపడే వారికి మాత్రం అవకాశాలు రావాని తెలిపింది. దీంతో తాప్సీ మరోసారి తన కామెంట్స్‌తో వార్తల్లోకి ఎక్కింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×