BigTV English

Adipurush : ఆదిపురుష్ సరికొత్త రికార్డు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..?

Adipurush : ఆదిపురుష్ సరికొత్త రికార్డు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..?


Adipurush : భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆదిపురుష్ మూవీపై డివైడ్ టాక్ వచ్చింది. అయితే బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ఈ సినిమా కొత్తరికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టింది.

ఆదిపురుష్‌కు భారీ ఓపెనింగ్‌ లభించిందని చిత్ర బృంద తెలిపింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లు గ్రాస్‌ వసూలు చేసిందని వెల్లడించింది. అన్ని వయసుల ప్రేక్షకుల హృదయాలను ఈ మూవీ గెలుచుకుందని పేర్కొంది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని స్పష్టం చేసింది. తొలి సన్నివేశం నుంచి చివరి వరకూ యువ ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించారని వివరించింది. నిజంగా వాళ్లకు మరువలేని అద్భుతమైన అనుభూతి ఇది అని పేర్కొంది.


హిందీలో ప్రభాస్‌, ఓం రౌత్‌లకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా బాగా అయ్యాయి. హిందీలో తొలి రోజు రూ.37.25 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించిందని సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ ట్వీట్ ద్వారా తెలిపారు.

తొలి రోజు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఆరు ఉన్నాయి. అందులో బాహుబలి-2, సాహో, ఆదిపురుష్‌ ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ సుమారు రూ.50 కోట్లు గ్రాస్‌ వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.

ఓం రౌత్‌ దర్శకత్వంలో ఆదిపురుష్ తెరకెక్కింది. ప్రభాస్‌ రాఘవుడిగా నటించాడు. కృతి సనన్‌ జానకి పాత్ర పోషించింది. లంకేశ్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ కనిపించాడు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×