EPAPER

Padmapriya: అందరి ముందే చిత్రవధ చేశాడు..ఆ డైరెక్టర్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

Padmapriya: అందరి ముందే చిత్రవధ చేశాడు..ఆ డైరెక్టర్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

Padmapriya.. మలయాళ ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా (Justice Hema)కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత అందరూ ఉలిక్కిపడ్డారు. సినీ ఇండస్ట్రీలో ఆడవారు లైంగికంగా వేధింపులు ఎదుర్కొంటున్నారని, అవకాశాలు కావాలి అంటే దర్శకులు, నిర్మాతలు చెప్పినట్టు వారి పక్కలోకి వెళ్లాలని , వారు చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తారని, ఇలా ఎంతోమంది ఆడవారు మలయాళ ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్నారంటూ ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది. దీనికి తోడు చాలామంది సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకొచ్చి తమకు జరిగిన ఇబ్బందుల గురించి మీడియాతో చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరొక నటి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది.


తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం..

ఆమె ఎవరో కాదు పద్మప్రియ (Padma priya) . 2007లో జరిగిన ఒక సంఘటనను తాజాగా గుర్తు చేసుకుంది. పద్మప్రియ తెలుగు హీరోయిన్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. నిజానికి ఈమె తమిళ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినా శ్రీను వాసంతి లక్ష్మి సినిమాతో హీరోయిన్ గా తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళ్, మలయాళం , హిందీ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం మలయాళంలో సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది పద్మప్రియ. ఇదిలా వుండగా.. 2017 లో పద్మప్రియ ఒక తమిళ్ సినిమా చేస్తుండగా.. ఆ సినిమా డైరెక్టర్ సామి.. సినిమా సెట్ లో అందరి ముందు పద్మప్రియను కొట్టారట. అప్పట్లో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అంతేకాదు ఆ డైరెక్టర్ పై ఒక సంవత్సరం పాటు సినిమా ఇండస్ట్రీ బ్యాన్ కూడా విధించారు అని సమాచారం.


అందరి ముందు పద్మప్రియ పై చేయి చేసుకున్న డైరెక్టర్..

ఇదిలా ఉండగా ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ పద్మప్రియ ఈ విధంగా కామెంట్లు చేసింది. ఆ డైరెక్టర్ అందరి ముందు నన్ను కొడితే.. కొంతమంది నేనే ఆ డైరెక్టర్ ని కొట్టానని ఆరోపించారు. మొదట్లో నా వాదనను ఎవరు కూడా పట్టించుకోలేదు. ముఖ్యంగా మహిళల అనుభవాలను ఎక్కువగా కొట్టి పారేస్తారు, లేదంటే వారిదే తప్పు అన్నట్టు చిత్రీకరిస్తారు. నాకు ఎదురైనా అనుభవమే ఇందుకు పెద్ద ఉదాహరణ. ఆ తర్వాత ఆ డైరెక్టర్ ను తమిళ పరిశ్రమ ఒక ఏడాది పాటు బ్యాన్ చేయడంతో అప్పుడే అందరికి తెలిసింది. నేను కాదు అతడే నన్ను కొట్టాడని, మొత్తానికైతే ఆ తర్వాత నేను కూడా తమిళ్ సినిమాలు చేయడం మానేశాను అంటూ తెలిపింది పద్మప్రియ.

పద్మప్రియ నటించిన తెలుగు చిత్రాలు..

పద్మప్రియ నటించిన తెలుగు చిత్రాల విషయానికొస్తే.. శ్రీను వాసంతి లక్ష్మి సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత అందరి బంధువయ, పటేల్ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్న ఈమె మంచి భరతనాట్య కళాకారిణి కూడా. ప్రస్తుతం మలయాళ పరిశ్రమలో ఉమెన్స్ సేఫ్టీ గురించి పనిచేస్తూ ఆడవారికి అన్యాయం జరగకుండా చూస్తోంది ఈ ముద్దుగుమ్మ . మొత్తానికి అయితే పద్మప్రియ ఒక డైరెక్టర్ తనపై దాడికి దిగారంటూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Related News

Martin Movie Review : మార్టిన్ మూవీ రివ్యూ…

Fahadh Faasil: 100 కోట్ల హీరో అని చెప్పండ్రా ఈయనకు.. మరీ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు

Viswam: మాస్ సాంగ్ అదిరింది.. కావ్య అందాలు అయితే నెక్స్ట్ లెవెల్..

Tollywood Heroine: బూరె బుగ్గలతో ముద్దొస్తున్నఈ చిన్నారి.. ఇప్పుడు యమా హాట్ బ్యూటీ.. గుర్తుపట్టండి చూద్దాం

Soundarya: సౌందర్య నిర్మించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా..?

Thiruveer: మసూద హీరో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’.. చీఫ్ గెస్ట్ గా రానా..

Vettaiyan : రానా మళ్లీ అదే మిస్టేక్ చేస్తున్నాడు.. ఇకనైనా మారండి బాస్..!

Big Stories

×