Intinti Ramayanam Today Episode August 24 th : నిన్నటి ఎపిసోడ్ లో.. కొత్తగా పెళ్లయిన దంపతులు కదా అత్తయ్య వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నా వాళ్లకి పెళ్లి జరిగింది.. మనము సాంప్రదాయం ప్రకారం వ్రతం చేయించాలి కదా అని అవని అంటుంది.. దాని గురించి పార్వతి ఆలోచిస్తుంది కానీ పల్లవి మాత్రం ఈ వంకతో ఇంట్లోనే తిష్ట వేసేలా ఉంది అని ఆలోచిస్తుంది. ఏదైనా చేసి అవని ఈ ఇంటికి రానివ్వకుండా చేయాలని మనసులో అనుకుంటుంది. ఈ విషయాన్ని చక్రధర్ తో చెప్పాలని బయటకు వెళ్తుంది. పల్లవి మాటలు విన్న చక్రధర్ ఏదో ఒకటి చేద్దాం అని అంటాడు. నువ్వేం భయపడకు బేబీ నేను ఏదో ఒకటి చేస్తాను అని అంటాడు. పార్వతి అక్షయ్ దగ్గరికి వెళ్లి ఎంత బ్రతిమలాడినా కూడా వ్రతం చేయడానికి నేను రాను అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. శ్రీకర్ తన ఫ్రెండుతో కలిసి కారులో వెళ్తూ ఉంటాడు. ఇంతకుముందు ఎప్పుడూ బాధగా కనిపించే నువ్వు.. ఇప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏంట్రా నీ సంతోషానికి కారణం అని అడుగుతాడు తన ఫ్రెండ్.. మా వదిన మా చెల్లెలు పెళ్లి చేసింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న మా చెల్లి చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ కూడా వదినపై కోపాన్ని తగ్గించుకుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని శ్రీకర్ అంటాడు.
ఇప్పుడు మా ఇంట్లో సమస్యలు తగ్గిపోయాయి రా అందుకే నేను సంతోషంగా ఉన్నానని తన ఫ్రెండ్ తో అంటాడు శ్రీకర్. ఇద్దరూ కారులో వెళుతూ ఉండగా అక్షయ్ ని మోసం చేసిన వ్యక్తి శ్రీకర్కు కనిపిస్తాడు. అతని దగ్గరకు వెళ్లి మా అన్నయ్య చేత దొంగ సంతకం పెట్టించుకునింది నువ్వే కదా అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నారు అసలు ఎవరు మీరు అని అతను అడుగుతాడు. ఎంతమందిని ఇలా మోసం చేస్తావురా అని శ్రీకర్ అంటాడు. మీరు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారో నా గురించి మీకు తెలుసా అని ఆ వ్యక్తి అంటాడు.
మీ అన్న ఎవరు ఎందుకు నా మీద దౌర్జన్యం చేస్తున్నారని ఆ వ్యక్తి దబాయిస్తాడు. మీరు కంట్రోల్ తప్పితే నేను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని ఆ వ్యక్తి అంటాడు. అయితే శ్రీకర్ నువ్వు ఇవ్వడం ఏంట్రా నేనే నేను పోలీసులకు పట్టిస్తారా అని తీసుకొని వెళ్తాడు. కమల్ భానుమతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన భరత్ ప్రణతిలను చూసి మీరు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు ఎందుకింత దిగులుగా ఉన్నారని భానుమతి అడుగుతుంది.
ఇంట్లో ఇన్ని సమస్యలు ఉంటే వాళ్లకి మనశ్శాంతి ఎక్కడుంటుంది అని కమల్ అంటాడు. ఇంట్లో ఏం జరిగినా సరే మీరు మాత్రం సంతోషంగా ఉండాలి. పెళ్లయిన కొత్తల్లో మా ఆయన నేను ఎలా ఉండే వాళ్ళని తెలుసా అని ఎగ్జాంపుల్ గా చెప్తుంది. అప్పుడే ఇంట్లోకి పార్వతి రావడం చూస్తారు. వ్రతం గురించి అన్నయ్య వాళ్ళతో చెప్పారా వస్తానని అన్నారని కమల్ అడుగుతాడు.
ఏమైంది పార్వతి వ్రతం చేయించడానికి అక్షయ్ ఒప్పుకున్నాడా అని భానుమతి అడుగుతుంది. కానీ పార్వతి మాత్రం దిగులుగా రతన్ చేయడానికి అక్షరం రావట్లేదు అని చెప్పేసాడని అంటుంది. అప్పుడే పార్వతికి అవని ఫోన్ చేస్తుంది. అక్షయ్ ని అవని రాజేంద్రప్రసాద్ ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు. పల్లవి బావగారికి పెళ్లంటే ఇష్టం లేదు ఇక ఈ వ్రతాన్ని ఎలా చేస్తారు అనుకున్నారు అంటూ మాటలతో బాధపెడుతుంది. ఈ వ్రతాలు అవి ఇవి ఎందుకు ఏదో పెళ్లయింది అందరితో సంతోష పడాలి కానీ.. అన్ని చేయాలంటే అదృష్టం కూడా ఉండాలని ప్రణతిపై సీరియస్ అవుతుంది పల్లవి. శ్రేయ కూడా పల్లవి ఏదంటే అదే అంటుంది.
Also Read: బాలు తప్పులేదని తెలుసుకున్న మీనా.. గుణకు చుక్కలే.. షాక్ లో ప్రభావతి..
పార్వతి ఎవరు ఎలా పోయినా సరే ఈ వ్రతం జరుగుతుంది అని అందరితో చెప్పేస్తుంది. ఆ మాట వినగానే ప్రణతి భరత్ ఇద్దరు సంతోషపడతారు. శ్రీకర్ అవని కి ఫోన్ చేసి అతను దొరికాడంటూ చెప్తాడు. మరి ఇద్దరూ కలిసి అతని చేత నిజం కక్కిస్తారా? అక్షయ్ కు నిజం తెలిసి అవని పై ప్రేమ పెరుగుతుందా? సోమవారం ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుందని అర్థమవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి..