Mahatma Gandhi Jayanti 2024 Quotes: అక్టోబర్ 2న జాతిపిత మహాత్మ గాంధీ జయంతి. బాపూజీని ఫాలో అయ్యేవారు మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా మందే ఉన్నారు. ఆయన గొప్ప మాటలు ఎంతో మంది మందికి ఓ స్పూర్తిధాయకం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని సూక్తులను గుర్తుచేసుకుందాం.
తన అహింసా సందేశంతో దేశ స్వాతంత్య్రం కోసం పోరు సల్పి మహాత్మ గాంధీగా పిలవబడే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.. దేశ స్వాతంత్య్రం కొరకు సాంతీ, అహింసలను ఆయుధాలుగా మలుచుకుని బ్రిటీష్ వారితో పోరాడి విశ్వ విఖ్యాతిగాంచిన ప్రజానాయకుడు అయ్యారు. “మానవులంతా ఒక్కటే.. అందరూ సమానమే” అన్న పరమ సత్యాన్ని ప్రసాదించి తెల్లదొరల్లా అహంకారాన్ని ఎదిరించిన దీశాలి. బాపూజీ జయంతి సంధర్భంగా ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలను తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికి ఉంది. బాపూజీ ఎన్నో విలువైన మాటలు చెప్పారు. అందులో కొన్ని సూక్తులు ఇప్పుడు తెలుసుకుందాం.
మహాత్మ గాంధీ నీతి సూక్తులు
దేశం అభివృద్ధి చెందాలంటే అద్దాల మేడలు, రంగు రంగుల గోడలు నిర్మించడం కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.
పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడి ఉండదు కానీ.. అది మనకు అందించే ఆలోచన పైనే ఆధారపడి ఉంటుంది.
సహాయం చేస్తే మరిచిపో కానీ.. సహాయం పొందితే మాత్రం గుర్తుపెట్టుకో
నువ్వు ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకుంటావో.. దానికి మొదట నువ్వే నాంది పలకాలి.
ఎవరైన మనకి ఇచ్చేది తాత్కాలికమే.. కానీ మనం కృషి చేసి సంపాదించుకుంటే మాత్రం శాశ్వతంగా మిగిలిపోతుంది.
సత్యం ఒక్కటే జీవితాన్ని సన్మార్గంలో తీసుకొస్తుంది.
మరణానికి భయపడుతున్నావంటే.. చిరిగిపోయిన బట్టని కూడా వదలాటినికి భయపడుతున్నావని అని అర్ధం.
ముఖంపై చిరునవ్వు లేకపోతే.. అందమైన వస్త్రాలు, ఆభరణాలు ధరించిన ముస్తాబు పూర్తికానట్లే.
చదువులో ఆనందం పొందారంటే.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.
పిల్లలు దేవునితో సమానం.. కాబట్టి వారితో అబద్దాలు ఆడించకూడదు. చెడ్డ పనులు చెప్పకూడదు.
Also Read: ఢిల్లీ సీఎం అతిశీకి చేదు అనుభవం… తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోని పోలీసులు?
మానవత్వాన్ని మించింది ఈ లోకంలో ఏది లేదు. మానవత్వం సముద్రం లాంటిది. అందులో రెండు చుక్కలు మలినం పడినంత మాత్రానా ఏమి చెడిపోదు.
పక్కవారితో పోల్చికోవడం.. ఇతరుల నుంచి ఆశించడం ఆపేస్తే.. జీవితంలో సగం సమస్యలు తీరిపోయినట్లే..
మంచి పుస్తకం వెంట ఉంటే.. మంచి మిత్రుడు లేని లోటు కనిపించదు.
అందం అనేది నడవడికలో ఉంటుంది.. ఆడంబరాల్లో కాదు.
మహా వృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది. అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటలకంటే చేతలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.
పెద్దలు మాట్లాడుతుంటే ఫస్ట్ మౌనంగా వినాలి. ఆ తర్వాతే సమాధానం చెప్పాలి.
ఎక్కవ తక్కువలు ఉండటం, కుల మత బేధాలు ఉండటం.. మానవ జాతికే అవమానకరం.
సాధ్యం అనుకుంటే.. ఎంతటి కష్టం పని అయినా సరే.. సులువుగా పూర్తవుతుంది.
వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి.. సర్వస్వాన్ని కోల్పోయినట్లే..