BigTV English

Faheem Ashraf : మా ఆకలి తీరింది… పాకిస్తాన్ క్రికెటర్ వివాదాస్పద పోస్ట్… గందరగోళంలో ఆసియా కప్

Faheem Ashraf : మా ఆకలి తీరింది… పాకిస్తాన్ క్రికెటర్ వివాదాస్పద పోస్ట్… గందరగోళంలో ఆసియా కప్

Faheem Ashraf : ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పహల్గామ్ లో జరిగిన ఈ ఉగ్రదాడికి పాకిస్తాన్ మద్దతు ఉందని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రెండు దేశాల సైన్యాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ తరుణంలోనే పాకిస్తాన్ క్రికెటర్లు అన్ని పరిమితులను దాటుతూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. తొలుత షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను చూపించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో పాకిస్తాన్ క్రికెటర్ ఫహీమ్ అష్రఫ్ భారత్ పై విషాన్ని వెళ్లగక్కాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుధ్దవాతావరణం జరిగిన సమయంలో  ఫహీమ్ అష్రఫ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్టోరీని పంచుకున్నాడు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.


Also Read : Sachin Tendulkar: ఖరీదైన ఫ్లాట్ కొన్న సచిన్… కొడుకు అర్జున్ వేరు కాపురం పెట్టనున్నాడా !

పాకిస్తాన్ తో మ్యాచ్ ఎందుకు..? 


ఆ స్టోరీలో “పాకిస్తాన్ జెండాతో పాటు.. పాకిస్తాన్ ను నాశనం చేయగల శక్తి ఈ భూమి పై లేదు” అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్టు పై ఫహీమ్ అష్రఫ్ చాలా విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ ఎందుకు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అసలు బీసీసీఐ, భారత ప్రభుత్వం ఆసియా కప్ నకు పాకిస్తాన్ తో ఆడేందుకు ఫర్మిషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఇక   పాకిస్తాన్ కి చెందిన చాలా మంది క్రికెటర్లు ఇండియా పై నెగిటివ్ గా ఏదో ఒక కామెంట్స్ చేస్తున్నారు. వారికి భారతీయ నెటిజన్లు దిమ్మ తిరిగే విధంగా కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు ఆసియా కప్-2025కి సంబంధించి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి గ్రీన్ సిగ్నల్ లభించింది.

క్రీడా మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ 

ముఖ్యంగా పాకిస్తాన్ తో సమరానికి భారత క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. బహుళ దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ తో ఆడితే ఆపబోమని స్పష్టం చేసింది. పాకిస్తాన్ తో మాత్రం ఏ క్రీడలో కూడా ద్వైపాక్షిక సిరీస్ లు మాత్రం ఉండవు అని తేల్చి చెప్పింది. వారు తమ గడ్డ పై అడుగు పెట్టడానికి కానీ.. భారత జట్టు పాకిస్తాన్ లో ఆడటానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతివ్వబోమని తెలిపింది. అంతర్జాతీయ టోర్నీల్లో తటస్థ వేదికలపై పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడితే అభ్యంతరం లేదని పేర్కొంది. ఇక సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా జరుగబోయే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి లైన్ క్లియర్ అయినట్టే స్పష్టంగా కనిపిస్తోంది. ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 09 నుంచి దుబాయ్, అబుదాబీ వేదికలుగా జరుగనున్నాయి. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండటం విశేషం. టీమిండియా తొలి మ్యాచ్ ను యూఏఈతో సెప్టెంబర్ 10న, సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో, సెప్టెంబర్ 19న ఒమన్ తో తలపడనుంది. సెప్టెంబర్ 28 న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

Related News

Yuzvendra chahal : చాహల్ కు షాక్… ఆ పొలిటీషియన్ తో RJ మహ్వాష్ ఎ**ఫైర్?

Asia Cup 2025: ఆసియా కప్ 2025 ఆడే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇదే… రషీద్ ఖాన్ కు కెప్టెన్సీ

BCCI : సెలెక్టర్లను ఎలా బీసీసీఐ ఎంచుకుటుంది.. ఉండాల్సిన అర్హతలు ఏంటి

APL 2025: APL-2025 విజేతగా తుంగభద్ర వారియర్స్… పుష్ప రేంజ్ లో సెలబ్రేషన్స్… ప్రైజ్ మనీ ఎంత అంటే

Sachin Tendulkar: ఖరీదైన ఫ్లాట్ కొన్న సచిన్… కొడుకు అర్జున్ వేరు కాపురం పెట్టనున్నాడా !

Big Stories

×