Weekly Horoscope : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (ఆగస్ట్ 24 నుంచి 30 వరకు) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: మానసిక రుగ్మతలకు గురవుతారు స్త్రీ వ్యామోహంలో నైతిక బాధ్యతలను మరిచిపోతారు. చపలచిత్త ప్రవర్తనతో ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తారు. కుటుంబం అండగాఉంటుంది. బంధుమిత్రులతో కలిసి గడుపుతారు. కొత్త వ్యాపారాలు.. పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. మీ గ్రామదేవతను దర్శించండి. విఘ్నేశ్వరుడికి పాలు, గోధుమ రవ్వతో చేసిన నైవేద్యం సమర్పించండి.
వృషభ రాశి: బుధ, శుక్రుల కలయిక లక్ష్మీయోగాన్ని, రాజయోగాన్ని అందిస్తున్నాయి. మీ మాటతీరు ఇతురులను ఆకర్షిస్తుంది. 5వస్థానంలో కుజగ్రహ సంచారం ముఖ్యమైన పనుల్లో ఆటంకాలను కలిగిస్తాడు. ద్వాదశంలో శనిగ్రహ సంచారం ఆర్థిక పరమైన నష్టాలు కలిగిస్తాడు. మానసికంగా దృఢంగా ఉండటానికి ధ్యానం, వ్యాయామం చేయడం మంచిది. గణపతికి సింధూరం సమర్పించండి.
మిథున రాశి: కుటుంబంలో యుద్ధవాతావరణం నెలకొంటుంది. భూ విక్రయాలు నష్టాన్ని కలిగిస్తాయి. సోదరవర్గంతో విరోధాలు ఏర్పడుతాయి. ఏపని మొదలుపెట్టినా అవరోధాలు ఎదురవుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణము 8సార్లు చేయండి. వడమాల సమర్పించండి. నిత్యం నుదుట సిందూరతిలకం ధరించండి.
కర్కాటక రాశి: నిత్యకళ్యాణం పచ్చతోరణంలా కాలం నడుస్తుంది. ఊహించని రీతిలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. దైవదర్శనాలు చేస్తారు. రుణబాధలు తొలుగుతాయి. బ్యాంకు తాకట్టులో ఉన్న సొమ్మును విడిపిస్తారు. పిత్రార్జితాన్ని వృద్ధి చేస్తారు. తొందరపడి మాట జారవద్ధు. పర్వతాల వద్ద సంచరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. బాలాత్రిపురసుందరి అమ్మవారికి వస్త్రాలను సమర్పించండి.
సింహారాశి: మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చేయు వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. గతంలో మీపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. మిత్రుల సహకారం అందుతుంది. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. అష్టమంలో శని ప్రభావం శారీరక శ్రమను అధికం చేస్తుంది. ధర్మమైన మార్గంలోనే కొనసాగండి. కాలం అనుకూలంగా మారుతుంది. దైవానుగ్రహం తోడుంటుంది. దుర్గగణపతిని పూజించండి. మినప గారెలు నైవేద్యంగా సమర్పించండి.
కన్యా రాశి: రాజకీయ పురోగతి కనిపిస్తోంది. చంద్రమంగళ యోగంతో ఉన్నత ఫలితాలు సాధిస్తారు. అధిష్ఠానం మీపై నమ్మకాన్ని ఉంచుతుంది. వివిధ రీతుల్లో ప్రయోజనాలు అందుకుంటారు. స్వల్పంగా అస్వస్థతకు గురవుతారు. జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉండండి. అర్థనారీశ్వర స్తోత్రము పఠించండి. శివాలయంలో దంపతులిద్దరు కలిసి అభిషేకం జరిపించండి.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులా రాశి: భాగ్య గురు వీక్షణ రాజ్యస్థానంలో బుధ, శుక్రుల కలయిక లాభ స్థానంలో రవి+కేతువులు అధికార పరంగా ఆర్థిక పరంగా శుభయోగాలు ఉన్నాయి. సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు మొదలవుతాయి. సంతానం అభివృద్ధిలో ఉంటుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి .
వృశ్చిక రాశి: శుభాశుభ ఫలితాలు సమానంగా ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోండి. ఉన్నతాధికారులతో స్వల్ప వేధింపులు ఉంటాయి. సహనంతో ఓపికగా ఉండటం మంచిది. ఆలోచనల్లో కౄరత్వాన్ని నింపకండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సత్సంకల్పాలు సిద్ధిస్తాయి. నాగదేవతలకు స్వచ్ఛమైన ఆవుపాలతో అభిషేకం జరిపించండి.
ధనస్సు రాశి: కుటుంబంలో స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. గర్భవతులు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. నరదృష్టి అధికంగా ఉంటుంది. బృహస్పతి వీక్షణ కొంత యోగాన్నిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయండి. నవధాన్యాలను దానం చేయండి.
మకర రాశి: ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు తగదు. పెద్దల ఆశీర్వాదం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త వ్యాపారాలు లాభిస్తాయి. సమస్యలు తీవ్రమైనా మనోబలంతో ఎదుర్కొంటారు. చెడు ఆలోచనలు వద్దు. బంధువులతో సరదాగా ఉండండి. వినాయకుడిని తెల్లజిల్లేడు పూవులతో పూజించండి .
కుంభ రాశి: మొండి పట్టుదల పనికిరాదు. 8వస్థానంలో కుజుడు ఆయుఃప్రమాదాన్ని కలిగించవచ్చును. బృహస్పతి వీక్షణ వల్ల సమయస్పూర్తితో వ్యవహరిస్తారు. విద్యుత్, వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక భద్రత పాటించండి. కందులు దానం చేయండి.
మీన రాశి: దైవబలం, గురుబలం తోడుంది. కులదైవంయొక్క ఆశీస్సులు ఉన్నాయి. స్త్రీ సంతానానికి అనారోగ్య లక్షణాలు ఉంటాయి. రాజకీయ శతృవులు పెరుగుతున్నారు. అప్రమత్తంగా ఉండటం మంచిది. నిత్యం కాలభైరవాష్టకం చదవడం వల్ల సంపూర్ణ శుభ ఫలితాలు పొందుతారు. ఏదైనా దేవాలయంలో బెల్లం+దీపారాధన నూనె దానం చేయండి.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే