Gundeninda GudiGantalu Today episode August 24 th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు అయినా నమ్మకాన్ని కూడా నేను పోగొట్టుకున్నానని బాధపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో మీనా కూడా బాలుని ఎలాగైనా సరే ఈ సమస్య నుంచి బయటకు తీసుకురావాలని ఆలోచిస్తుంది. మౌనిక మీనాకు ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకొనే ప్రయత్నాలు చెయ్యాలని అంటుంది. నువ్వు కూడా నమ్మకపోతే అన్నయ్య చాలా బాధపడతాడు.. అని మౌనిక అంటుంది. ఆయన నిజంగానే తాగి డ్రైవ్ చేసి ఉండడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అనుకుంటుంది. బాలు తన కారుని విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అయితే అక్కడ పోలీసులు ఇతను నిజంగానే తాగాడు అని ఆ వీడియోని చూసి దారుణంగా అవమానిస్తారు. కావాలని అక్కడున్న పనులని బాలు చేత చేయిస్తారు. బాలు ఎంతగా అవమానిస్తున్న సరే కారు కోసం మౌనంగా భరిస్తూనే ఉంటాడు. మీనా బార్లో అసలు నిజం తెలుస్తుందని ఉదయం లేవగానే అక్కడికి వెళుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ప్రోమో విషయానికి వస్తే.. బారు దగ్గర మీనా ను చూసినా యూట్యూబర్ రెచ్చిపోతాడు. యూట్యూబర్ చేసిన వీరంగానికి మీనా కోపంతో అతనిపై తిరగబడుతుంది. చెంపలు వాయించేస్తుంది. నా భర్త ఈ బార్ కు వచ్చి తాగలేదు అని నిరూపించడానికి నేను వచ్చాను అని నిజాన్ని కక్కేస్తుంది.. నీ భర్త మంచివాడు నిరూపించుకోవడానికి బారుకు వస్తుంది. షాప్ అతను రాగానే మీనా కూడా లోపలికి వచ్చేస్తుంది. అక్కడున్న వాళ్లంతా ఎవరమ్మా మీరు ఏం కావాలి అని అడుగుతారు.
నా భర్త ఈ బార్ కి తాగడానికి వచ్చారండి కానీ నా భర్త తాగలేదు తాగినట్లు ఇక్కడ క్రియేట్ చేస్తారు అని మీనా అసలు విషయం చెప్తుంది. మొదట ఆ బార్ ఓనర్లు నమ్మకపోయినా ఆ తర్వాత ఆమె బాధను అర్థం చేసుకుంటారు. బార్ ఓనర్ చెప్పిన విధంగా అక్కడ ఉన్న స్టాఫ్ మీనా కి సీసీటీవీ ఫుటేజ్ ని చూపిస్తారు. అందులో మీన బాలుని చూసి షాక్ అవుతుంది. అయితే బాలు పెగ్గు కలిపి ఎమ్మెల్యేకు ఇవ్వడం అందులో కనిపిస్తుంది. బాలు బార్క్ రావడం చూసిన మీన అక్కడ ఎమ్మెల్యేకి మందు పోసినట్లు కనిపిస్తుంది.
అయితే బాలు ఆ మందు తాగకుండా అతనికి ఇవ్వడం చూసి మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది.. కావాలనే మా ఆయన్ని ఇరికించారని బాధపడుతుంది. ఆరోజు బార్ల కూర్చున్న వాళ్ళందరి ఫుటేజ్ ని మీన చూస్తుంది. అయితే అక్కడ గుణ ఉండడం చూసి వీడే ఇదంతా చేసి ఉంటాడు అని అనుకుంటుంది.. కెమెరా పట్టుకొని రికార్డ్ చేయడం చూసిన మీన గుణాన్ని కావాలని ఆయనను ఇరికించాడు అని తెలుసుకుంటుంది..
కారు పోలీసులు దగ్గర నుంచి రాలేదు అని టెన్షన్ తో బాలు బాధపడుతూ ఉంటాడు. మీనా కార్ స్టాండ్ కి వెళ్లి బాలుని గట్టిగా హాగ్ చేసుకుంటుంది. ఏమైంది మీనా ఎందుకు ఏడుస్తున్నావ్ మా అమ్మగానే ఏమైనా అనిందా నిన్ను అని బాలు అంటాడు. కాదండి మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను అండి.. మీరు నిజం చెప్తున్నా కూడా నేను వినలేదు అని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. చూసావా మీనా నేను ఎంత చెప్పినా కూడా నన్ను నమ్మలేదు. బాలు ఎప్పుడు తప్పు చేయడు చేసిన తప్పుని ఒప్పుకోకుండా ఉండడు అని అంటాడు.
ఆ గుణ ఇదంతా చేశాడు అని మీనా అంటుంది.. నిజం తెలుసుకున్న మీనా బాలు ను క్షమించమని అడుగుతుంది. ఇక బాలు ఇప్పటికైనా నువ్వు నమ్మావు. అది చాలు జీవితాంతం నీ నమ్మకాన్ని పోగొట్టుకున్నానని నేను బాధపడాలి ఏమో అనుకున్నాను అని అంటాడు. రవి రాజేషు ఆ యూట్యూబర్ అన్ని పట్టుకుని వస్తారు.. వాడు అసలు నిజం బయటపెడతాడు. ఇక రవి ఫోన్ లోనే బాలు వీడియోని రికార్డ్ చేస్తాడు. నా తప్పేమీ లేదండి నా మీద బురదజల్లే ప్రయత్నంలోనే ఇదంతా చేసారు అని అంటాడు..
Also Read: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రేమ, నర్మద మధ్య గొడవ.. ధీరజ్ ప్రేమలో ప్రేమ..
ఆ వీడియోని చూసిన ప్రభావతి, మనోజ్, రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతారు. నా తప్పేమీ లేకుండా నన్ను ఇరికించారు అని బాలు అనడం చూసి ప్రభావతి మొహం ముడుచుకుంటుంది. చూశారా నా కొడుకు ఏ తప్పు చేయడు అని నేను అంటున్నా కూడా మీరు తప్పు చేశాడని అన్ని మాటలు అన్నారు. వాడు నిజంగానే ఏ తప్పు చేయలేదు అని సత్యం అంటాడు. ఈ వీడియో కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో బాలు పై పడిన మచ్చ పోతుంది. గుణపై బాలు రివేంజ్ తీసుకుంటాడేమో చూడాలి..