Terroist Masood Azhar: మసూద్ అజార్.. మోస్ట్ వాంటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు. భారత్ పై చాలా దాడుల్లో ఇతడి ప్రమేయం ఉంది. 2016లో పఠాన్‌కోట్‌లో ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడితో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడి సహా ఎన్నో దాడులకు సూత్రధారి. ఆపరేషన్ సిందూర్ లో జైషే ఉగ్రస్థావరాలు ధ్వంసమయ్యాక.. వాటిని మళ్లీ నిర్మించే ప్లాన్లు వేస్తున్నాడు. నిధులు ఇవ్వాలంటూ ఫండ్ రైజింగ్ గేమ్ షురూ చేశాడు. భారత్-పాక్ బార్డర్ లో టెర్రర్ క్యాంప్స్ రెడీ అవుతున్నాయా? లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటి?
ఆపరేషన్ సిందూర్ తర్వాత సైలెంట్
2016లో పఠాన్‌కోట్‌లో ఎయిర్‌బేస్‌పై ఎటాక్ తో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికుల్ని పొట్టనపెట్టుకున్నాడు. ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఉగ్రవాద దాడుల్లో మసూద్ అజార్ హస్తం ఉంది. సీన్ కట్ చేస్తే మే 6-7 తేదీలలో ఆపరేషన్ సిందూర్ తర్వాత కొన్ని రోజులు మసూద్ అజార్ సైలెంట్ అయ్యాడు. ఉగ్రవాద శిబిరాలను భారత వాయుసేన మిసైల్స్ ప్రయోగించి ధ్వంసం చేశాయి. ఆ టైంలో పంజాబ్ ప్రావిన్స్ లోని బహవల్పూర్ జైషే మహ్మద్ స్థావరంలో మసూద్ అజార్ కుటుంబ సభ్యుల్లో 10 మంది హతమయ్యారు. అతడి సోదరుడు కూడా చనిపోయాడు. పీడ విరగడ అయింది అనుకునేలోపే మసూద్ అజార్ మరో ప్లాన్ చేస్తున్నాడు.
ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్ర శిబిరాలు ధ్వంసం
ఆపరేషన్ సిందూర్ తో ఉగ్ర శిబిరాలన్నీ ధ్వంసమయ్యాయి. బిల్డింగ్ లు నేల కూలాయ్. దీంతో టెర్రరిస్టులకు ట్రైనింగ్, షెల్టర్ కష్టమవడంతో మళ్లీ మసూద్ అజార్ గేమ్ షురూ చేశాడు. ఏంటంటే.. ఫండింగ్ కావాలంటూ అక్కడి జనానికి ఒక అప్పీల్ చేశాడు. మన నిర్మాణాలు కూలిపోయాయ్.. వాటిని మళ్లీ నిర్మించాలంటే డబ్బు కావాలి.. తోచినంత విరాళాలు ఇవ్వండి అంటూ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ షురూ చేశాడు. మొత్తం 120 కోట్ల రూపాయలు ఫండ్ రైయిజ్ చేసే ఉద్దేశం ఉందంటున్నారు. వీటితో భారత్ పాక్ సరిహద్దుల్లో 313 టెర్రర్ క్యాంప్స్ నిర్మించాలన్న టార్గెట్ పెట్టుకున్నారంటున్నారు. ఈ మొత్తాన్ని మసూద్ అజార్ బంధువు అకౌంట్ కు జమ చేసేలా ప్లాన్ చేశారంటున్నారు.
ఆపరేషన్ సిందూర్ లో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ జాయింట్ గా పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని మిసైల్ ఎటాక్స్ చాలా కచ్చితత్వంతో నిర్వహించాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు భారత్ ప్రకటించింది. ఇందులో యూసఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదస్సిర్ అహ్మద్ వంటి కీలక ఉగ్రవాద కమాండర్లు ఉన్నారు. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ను 2019లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, ఆ లిస్టులో చేర్చింది.
ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడంలో బిజీబిజీ
మసూద్ అజార్, హఫీజ్ సయీద్.. ఇద్దరూ భారత వ్యతిరేక కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్నారు. సిందూర్ తో గట్టి దెబ్బ తగిలినా మళ్లీ టెర్రర్ గేమ్స్ షురూ చేస్తున్నారు. మొన్నటిదాడుల్లో 9 ఉగ్ర స్థావరాలను కచ్చితంగా గుర్తించి బ్లాస్ట్ చేసింది భారత్. అటు మసూద్ అజార్, ఇటు హఫీజ్ సయీద్ ఇద్దరూ తప్పించుకున్నారు. మసూద్ సోదరుడు మాత్రం హతమయ్యాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఈసారి గట్ట దెబ్బే కొట్టేందుకు రెడీ అవుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయిన మసూద్ అజార్.. సైలెంట్ గా జులైలో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తిరిగాడు. ఈ విషయాన్ని భారత్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు పసిగట్టేశాయి. పీఓకేలో మసూద్ తిరిగి రెక్కీ నిర్వహించాడు. ఇప్పుడు పక్కాగా టెర్రర్ క్యాంప్స్ నిర్మాణం కోసం ఫండ్ రెయిజింగ్ చేస్తున్నాడు. మసూద్ కదలికలపై మన నిఘా వర్గాలు గురి పెట్టాయి. అజాయర్ స్కర్దూ, సద్‌పారా ఏరియాల్లో కనిపించిన విషయాన్ని ఇంటెలిజెన్స్ గుర్తించింది. పలు ప్రైవేటు, గవర్నమెంట్ గెస్ట్ హౌస్‌ల్లో మసూద్ కనిపించాడన్నది. మారు వేషాల్లో తిరుగుతూ టెర్రర్ క్యాంప్స్ ను యాక్టివేట్ చేసే ఉద్దేశంతోనే పర్యటించాడన్న కీలకంగా మారుతోంది.
POKలో తిరిగి రెక్కీ చేసిన మసూద్ అజార్
పాకిస్తాన్ పాలకులు మాత్రం మసూద్ అజార్ మాత్రం తమ దేశంలో లేడని బుకాయిస్తూ వచ్చారు. భారత్ సమాచారం ఇస్తే తామే అరెస్ట్ చేస్తామంటూ మాట్లాడారు. కానీ అవన్నీ వట్టి మాటలే. బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుబాన్ షెల్టర్.. మసూద్ అజార్ కు కీలకం. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహ్మద్ దీన్ని ఆపరేషనల్ హెడ్‌క్వార్టర్‌గా చెబుతారు. పుల్వామా దాడి సహా భారత్‌పై చాలా కుట్రలు ఇక్కడే ప్లానింగ్ చేశారంటారు. మసూద్ అజార్ సన్నిహితులు ఈ క్యాంప్ నుంచే ఆత్మాహుతి దాడులకు ట్రైనింగ్ ఇవ్వడం, ప్లానింగ్ వంటివి చేశారని గుర్తించారు. దీన్ని జైషే చీఫ్ మసూద్ ఇంటిగా కూడా వాడినట్లు గుర్తించారు. ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబసభ్యులు కూడా అందులోనే ఉన్నారు. సిందూర్ దాడి తర్వాత ఇది నేల కూలింది. 600 మంది ఉగ్రవాదుల ఇండ్లు ఈ క్యాంపస్‌లోనే ఉన్నాయి.
పర్వత ప్రాంతాల నుంచి మసూద్ కార్యకలాపాలు
మసూద్ అజార్ లాంటి వాళ్లు బవహల్‌పూర్ పర్వతాల్లో దాక్కొని అక్కడినుంచే కార్యకలాపాలను సాగిస్తుంటే… వారికి భిన్నంగా హఫీజ్ సయీద్ జనావాసాల మధ్య ఉంటున్నాడు. సామాన్య జనానికి నష్టం చేసేలా భారత్ దాడులు చేయబోదు అన్న ఉద్దేశంతో జనం మధ్యే తిరుగుతున్నాడు హఫీజ్ సయీద్. ఎందుకంటే ఇటీవలి ఆపరేషన్ సిందూర్ లో పాక్ పౌరులకు నష్టం జరగకుండా భారత్ ఎటాక్స్ చేసింది. ఇదే హఫీజ్ సయీద్ కు చాలా కలిసి వచ్చింది. లాహోర్‌లోని అత్యంత రద్దీగా ఉండే నివాసాల మధ్య హఫీజ్ సయీద్ ఉంటున్నాడు. ఆపరేషన్ సిందూర్ తర్వాత అతడి ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ, లష్కరే ముఠా రెగ్యులర్ గా పహారా కాస్తున్నట్లు మన నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతోపాటు కాంపౌండ్ చుట్టూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా డ్రోన్లతో నిఘా పెట్టుకున్నారు. హఫీజ్ ఇంటికి నాలుగు వైపులా 4 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలనూ పెట్టుకుని వ్యవహారం నడిపిస్తున్నాడు.
ఆపరేషన్ సిందూర్ స్ట్రాటజీలో దోవల్ కీ రోల్
ఆపరేషన్ సిందూర్ స్ట్రాటజీలో జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్ కీ రోల్ పోషించారు. దీనికోసం రక్షణ, నిఘా అధికారులతో దాదాపు 15 సమావేశాలను నిర్వహించారు. దీంటో టార్గెట్స్ ఎంపిక, దాడుల టైమింగ్, నిర్వహణ విధానాలపై క్లారిటీగా స్ట్రాటజీ రచించారు. ఈ ఆపరేషన్ కోసం భారత నిఘా సంస్థలు.. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ – రా కీలక సమాచారం అందించింది. పకడ్బందీగా 9 ఉగ్రవాద స్థావరాలను ఎంపిక చేసుకొని, వాటిలో ఉగ్రవాదుల కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించింది. గురి తప్పకుండా ఎటాక్స్ చేసి డ్యామేజ్ చేయడంలో సక్సెస్ అయింది భారత్.
తెహ్రా కలాన్‌లోని క్యాంప్ నుంచి సొరంగాల తవ్వకం
తెహ్రా కలాన్‌లోని సర్జల్ క్యాంప్ అన్నది జైషే మహ్మద్ ఉగ్ర స్థావరం ఇది. దీన్ని కూడా జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. భారత్‌లోని సాంబా సెక్టార్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్‌లోకి రహస్య సొరంగాలు తవ్వేందుకు కేంద్రం ఇది. భారత్‌లోకి ఆయుధాలు, మత్తు పదార్థాలు రవాణా చేసేందుకు ఇది ప్రధాన లాంచ్ ప్యాడ్. ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. కోట్లిలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరం నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ 125 మంది శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. ముజఫరాబాద్‌లోని సైద్నా బిలాల్ ఉగ్ర స్థావరం… పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ఇవన్నీ ఆపరేషన్ సిందూర్ లో కూలిపోయాయి. అయితే మళ్లీ వీటిని ఆపరేట్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
Also Read: యూరియా కొరతకు చెక్..! సీఎం ప్లాన్ ఏంటంటే..?
అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే.. కూలిపోయిన శిబిరాలను మసూద్ అజార్ మళ్లీ ఏర్పాటు చేసుకునే ప్లాన్లు పెంచడమే. ఏకంగా 313 ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసుకునేందుకు ఫండ్ రెయిజింగ్ లో దూకుడు పెంచాడు. మరోవైపు ఆపరేషన్ సిందూర్ ముగియలేదని హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చాలా సందర్భాల్లో చెప్పారు. మసూద్ అజార్ కొత్త క్యాంపులు నిర్మిస్తే మళ్లీ వాటిని గుర్తించి పేల్చేసే ప్లాన్ ను భారత్ చేస్తుందా అన్నది చూడాలి.
Story By Vidya Sagar, Bigtv