CM Chandrababu: అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారశైలి మారిందా? పాతవారికంటే.. కొత్తగా వచ్చినవారు పార్టీకి తలనొప్పిగా మారారా? శనివారం రాత్రి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధినేత ఎలాంటి హెచ్చరికలు చేశారు? అలాంటివారిని పక్కనపెట్టడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రత్యర్థులు నిత్యం మన కోసం కాచుకుని ఉన్నారు.. ఏ చిన్న తప్పదొరికినా సోషల్‌మీడియా ద్వారా చీల్చిచెండాడు తున్నారు. ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని, తప్పులేకుంటే వెంటనే చర్యలు చేపట్టాలని పదేపదే చెబుతున్నారు సీఎం చంద్రబాబు. అయినా కొందరు, కొత్త గా వచ్చిన ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఎలాంటి మార్పురాలేదు. ఫలితంగా పార్టీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నారు.
ఈ ఏడాది పాలన తర్వాత దాదాపు అరడజను ఎమ్మెల్యేలు తమ ప్రవర్తనతో వార్తల్లోకి వచ్చారు. నేతలు వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు అధినేత. శనివారం రాత్రి సీఎం క్యాంపు ఆఫీసులో పార్టీ లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులు, కమిటీల ఎంపికపై త్రిసభ్య కమిటీల సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలకు పార్టీ విధానాలు, క్రమశిక్షణ గురించి తెలుసుకోవడంతో పద్ధతిగా నడుచుకుంటున్నారని అన్నారు సీఎం చంద్రబాబు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బాధ్యతగా ఉండాలని తేల్చిచెప్పారు. తాను ఇప్పటివరకు 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి ఫేస్ టు ఫేస్ మాట్లాడనని గుర్తు చేశారు.
ALSO READ: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ ప్లాట్ కావాలా?
అంతేకాదు తన ఆలోచన ఎలా ఉంటుందో విడమరిచి చెప్పారు. ట్రాక్ తప్పుతున్న ఎమ్మెల్యేలకు తొలుత పిలిచి పద్ధతి మార్చుకోవాలని చెబుతానని, రెండోసారీ గమనిస్తానని అన్నారు. అప్పటికీ ఆయా నేతల ప్రవర్తనలో మార్పురాకుంటే కఠినంగా వ్యవహరిస్తానంటూ ఘాటుగా హెచ్చరించారు.
కూటమి బాగుంటే ప్రజలు బాగుంటారని, ప్రజాప్రతినిధులు పదేపదే తప్పులు, వార్తల్లోకి రావడం సరికాదన్నారు. ఈ విషయంలో సమన్వయకర్తలు, ఇన్‌ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
అధికారంలో ఉన్నామని ధీమా వద్దని చెబుతూనే.. వైసీపీ తప్పుడు ప్రచారాలపై ఏమాత్రం మౌనం వద్దని చెప్పకనే చెప్పారు. సంక్షేమ పథకాలపై చర్చ జరగకూడదనేది వైసీపీ లక్ష్యమని, చేసిన మంచిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు సీఎం చంద్రబాబు.
అధికారంలో ఉన్నామనే అలసత్వం ఏ మాత్రం వద్దని, పార్టీ-ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచేలా నేతల పనితీరు ఉండాలని కుండబద్దలు కొట్టేశారు. . ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని అదే సమయంలో ప్రజలతో నిత్యం మమేకం కావాలన్నారు.
మొత్తానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు చెప్పాల్సినదంతా చెప్పారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు. ఇకపై నేతలు మారకుంటే కొరడా ఝులిపించడం ఖాయమని స్పష్టత ఇచ్చారు. మరి నేతల తీరు మారుతుందా? లేదా అనేది వెయిట్ అండ్ సీ.