APL 2025: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ {APL} నాలుగో సీజన్ లో తుంగభద్ర వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. శనివారం రోజు రాత్రి విశాఖపట్నంలోని ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తుంగభద్ర వారియర్స్ {Tungabhadra Warriors} జట్టు ఐదు వికెట్ల తేడాతో క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టుపై విజయం సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన అమరావతి రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
Also Read: Watch Video: పాపం ట్రాఫిక్ పోలీస్.. క్రికెట్ ఆడలేక.. బ్యాట్ అడుక్కుని మరీ… వీడియో వైరల్
అమరావతి రాయల్స్ బ్యాటర్లలో కెప్టెన్ విహారి {51} హాఫ్ సెంచరీ సాధించగా.. ప్రణీత్ {47} పరవాలేదనిపించాడు. వీరిద్దరూ మొదటి వికెట్ కి ఆరు ఓవర్లలో 70 పరుగులు చేశారు. అనంతరం వెంకట రాహుల్ {17}, ప్రసాద్ {6}, వినర్ కుమార్ {17}, సందీప్ {13} పరుగులతో నిరాశపరిచారు. ఇక చివర్లో పాండురంగ {22} మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. దీంతో అమరావతి రాయల్స్ 7 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.
ఇక తుంగభద్ర బౌలర్లలో శశికాంత్ 3, స్టీఫెన్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 195 పరుగుల లక్ష్య చేదనతో బరిలోకి దిగిన తుంగభద్ర వారియర్స్ జట్టు.. 18 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది. తుంగభద్ర కెప్టెన్ 3 పరుగులతో నిరాశపరిచినా.. జ్ఞానేశ్వర్ {66}, గుత్తా రోహిత్ {63} హాఫ్ సెంచరీలతో రాణించి.. జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ ని కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఇక ఇన్నింగ్స్ చివర్లో దత్త రెడ్డి {25}, ఆనంద్ {14*} పరుగులతో మ్యాచ్ ముగించారు. లీగ్ దశలో అమరావతి రాయల్స్ చేతిలో ఓడిన పరాభవానికి.. తుంగభద్ర జట్టు రివెంజ్ తీర్చుకుంది.
ఇక ఈ ఫైనల్ లో విజేతగా నిలిచిన తుంగభద్ర వారియర్స్ జట్టుకు 35 లక్షలు, రన్నరప్ గా నిలిచిన అమరావతి రాయల్స్ కి 20 లక్షల నగదు బహుమతి దక్కింది. ఈ బహుమతి ప్రధానోత్సవం లో ఏసీఏ అధ్యక్షులు, ఎంపీ కేశినేని శివనాద్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎస్ మాధవ్, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.
Also Read: Rinku Singh Love Story: రింకు సింగ్, ప్రియా సరోజ్ ను కలిపింది కరోనా లాక్ డౌన్ నేనా.? లవ్ స్టోరీ లీక్
ఇక ఈ {APL} ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన తర్వాత తుంగభద్ర వారియర్స్ {Tungabhadra Warriors} జట్టు ఆటగాళ్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆనందంలో డాన్స్ చేస్తూ.. కెమెరా వైపు దూసుకు వచ్చి ఎంజాయ్ చేశారు. అనంతరం పుష్ప స్టైల్ లో అందరూ వరుసగా నిలబడి గడ్డాన్ని సవరించారు. దీంతో తుంగభద్ర వారియర్ జట్టు ఆటగాళ్ల సంబరాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
?utm_source=ig_web_copy_link