Srinu Vaitla About Aagadu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ల ప్రస్తావన వస్తే శ్రీనువైట్ల పేరు కూడా వినిపించేది. చాలామంది దర్శకులు కంటే కూడా శ్రీనువైట్ల తన కెరీర్ లో ఎక్కువమంది స్టార్ హీరోలతో పనిచేసారు. కేవలం ఇప్పుడు స్టార్ హీరోస్ మాత్రమే కాకుండ సీనియర్ స్టార్ హీరోస్ తో కూడా పనిచేసిన ఘనత శ్రీనువైట్లకే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ వంటి దర్శకులకి దక్కని అరుదైన అవకాశం కూడా శ్రీనువైట్లకి దక్కింది. అదే మెగాస్టార్ తో సినిమా చేయటం. ఇకపోతే శ్రీను వైట్ల కెరియర్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సినిమా దూకుడు. మహేష్ బాబు కెరీర్ కి ఆ సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది.
శ్రీను వైట్ల డిజాస్టర్
ఇక శ్రీను వైట్ల సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీను వైట్ల స్ట్రెంత్ కామెడీ. శ్రీను వైట్ల సినిమాలలో కామెడీ చాలా నేచురల్ గా ఉంటుంది. ప్రస్తుత జనరేషన్ లో శ్రీను వైట్ల లాంటి దర్శకులు లేరు అని చెప్పాలి. సీరియస్ కథని కూడా కామెడీ యాంగిల్ లో చెబుతూ సక్సెస్ అయ్యాడు. ఇకపోతే ప్రతి దర్శకుడు కెరీర్ లో డిజాస్టర్ సినిమాలు కూడా ఉంటాయి. అలా శ్రీను వైట్ల కెరియర్ లో వచ్చిన బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా “ఆగడు”. ఈ సినిమా టైటిల్ లానే ఎక్కువ రోజులు థియేటర్లో ఆడకుండా వెళ్ళిపోయింది ఈ సినిమా. ఈ సినిమాలో కూడా అద్భుతమైన డైలాగ్స్ తో పాటు మంచి కామెడీ కూడా ప్రజెంట్ చేసాడు. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన దూకుడు సినిమా గుర్తుకురావడంతో ఈ సినిమాకి సరైన ఆదరణ దక్కలేదు.
అసలు కథ అది కాదు
ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల విశ్వం అని ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు శ్రీనువైట్ల. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆగడు సినిమాకి సంబంధించి అసలు కథ అది కాదు. భారీ స్కేల్లో ఉండే ఒక కథను నేను మహేష్ బాబుకి చెప్పాను. ఆ కథ కూడా మహేష్ బాబు కి బాగా నచ్చింది. కానీ ప్రొడ్యూసర్ అప్పుడు ఫైనాన్షియల్ గా లో లో ఉండటం వలన ఆ సినిమా చేయలేకపోయాం. ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దామని ఫిక్స్ అయి ఆగడు సినిమా చేశామంటూ చెప్పుకొచ్చాడు. ఇక మహేష్ బాబుతో చేసిన ఆగడు సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక హిట్ సినిమా కూడా చేయలేకపోయాడు శ్రీనువైట్ల.
“విశ్వం” మీదే అంచనాలన్నీ
ప్రస్తుతం గోపీచంద్ హీరోగా చేస్తున్న విశ్వం సినిమా మీదే అంచనాలన్నీ ఉన్నాయి. వీటన్నిటిని మించి ఈ సినిమాలో ఒక ట్రైన్ సీక్వెన్స్ ఉంది. ట్రైన్ సీక్వెన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది వెంకీ సినిమా. ఆ సినిమా లో ట్రైన్ సీక్వెన్స్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇప్పటికీ కూడా ఆ సినిమా చూస్తున్నప్పుడు మంచి ఫన్ క్రియేట్ అవుతుంది. చాలామంది యూట్యూబ్లో ఆ వీడియోస్ వెతుక్కుని మరి చూస్తారు. మరి విశ్వం సినిమాలో ట్రైన్ సీక్వెన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు.