Indian Railways: దేశంలో పండుగ సీజన్ మొదలయ్యింది. గణేష్ చవితితో పాటు దసర, దీపావళి, ఛత్ పూజ లాంటి పెద్ద పండుగలు వరుసగా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈ పండుగలను ఘనంగా జరుపుకుంటారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు కూడా ఈ పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే టికెట్లు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే, గత ఏడాది రైల్వేశాఖ టికెట్ల ముందస్తు బుకింగ్ గడుపును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. ఈ నేపథ్యంలో పండుగకు వెళ్లాలనుకునే వారు రైలు టికెట్ బుక్ చేసుకోవడానికి సరైన టైమ్ ఏది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
60 రోజుల అడ్వాన్స్ టికెట్ బుకింగ్ రూల్
గత ఏడాది నవంబర్ 1 నుంచి ముందుస్తు టికెట్ బుకింగ్ గడువు విషయంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు టికెట్ బుకింగ్ వ్యవధిని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. 60 రోజుల నియమం ప్రకారం, అక్టోబర్ 19న ప్రయాణించాలనుకునే వారు ఆగస్టు 20న రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే, దసరా, దీపావళి, ఛత్ పూజ లాంటి పండుగలకు మరికొద్ది రోజులే సమయం ఉన్న నేపథ్యంలో, రైలు టికెట్ల బుకింగ్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 60 రోజుల బుకింగ్ విండో అమలులో ఉన్నప్పటికీ, చాలా మంది ప్రయాణీకులు అనుకున్న సమయానికి టికెట్లు బుక్ చేసుకోలేకపోయారు. ఆన్ లైన్ పోర్టల్, రైల్వే టికెట్ కౌంటర్ ద్వారా టికెట్లు లభించకపోతే, ప్రయాణీకులకు తత్కాల్ టికెట్ ఎంపిక మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ టికెట్లు పొందడం చాలా కష్టమైన పని.
ఈ పండుగ సీజన్ లో టికెట్లు బుక్ చేసుకోవడానికి బెస్ట్ టైం
ఈ పండుగ సీజన్ లో మీ జర్నీ డేట్ ఫిక్స్ అయితే, మొదటి రోజు టికెట్లు బుకింగ్ అందుబాటులో ఉంటే, సాధారణంగా ఉదయం 8 గంటలకు IRCTC వెబ్ సైట్ లో లాగిన్ కావాలి. 60 రోజుల బుకింగ్ నియమం ప్రకారం, బుకింగ్ ఓపెన్ అయిన తొలి రోజు టికెట్ రిజర్వేషన్ చేసుకోవడం బెస్ట్.
Read Also: వినాయక చవితి ప్రత్యేకం.. అందుబాటులోకి 380 ప్రత్యేక రైళ్లు!
టికెట్ రిజర్వేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?
టికెట్ పై రిజర్వేషన్ స్టేటస్ ప్రింట్ చేసి ఉంటుంది. టికెట్ కన్ఫార్మ్ అయితే, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ AC క్లాస్ కాకుండా అన్ని తరగతులలో మీ కోచ్, బెర్త్ నంబర్లు టికెట్ మీద ఉంటాయి. ఈ క్లాస్ లకు, పక్కన కన్ఫార్మ్ చేయబడింది అని అని రాసి ఉంటుంది. ఒకవేళ మీ టికెట్ RAC స్థితిని చూపిస్తే, వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే. ఆ విషయం కూడా టికెట్ మీద రాసి ఉంటుంది.
Read Also: దీపావళికి కన్ఫార్మ్ టికెట్ కావాలా? సింపుల్ గా ఇలా బుక్ చేసుకోండి!