BigTV English

Kanguva : సూర్య ‘కంగువా’ లో ప్రభాస్.. ఇదేం ట్విస్ట్ మామా..!

Kanguva : సూర్య ‘కంగువా’ లో ప్రభాస్.. ఇదేం ట్విస్ట్ మామా..!

Kanguva : తమిళ స్టార్ హీరో సూర్య ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్నాయి. సూర్య పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉంది. తమిళ్లో ఆయన చేసిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి.. సూర్య ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.. గతంలో వచ్చిన సినిమాలు జనాలను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సరికొత్త కథతో ‘కంగువా’ అనే భారీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. ఇటీవల ఈ మూవీ విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో చూశాము.. ఇక తాజతాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


ఈ సినిమాలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు నటిస్తున్నారన్న విషయం తెలిసిందే.. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ ప్రభాస్ కి హోం బ్యానర్‌.. ఈ బ్యానర్ పై వస్తున్న ప్రతి సినిమాకు డార్లింగ్ సపోర్ట్ ఉండనే ఉంటుంది. చెన్నై లో లేదా హైదరాబాద్‌లో జరగబోతున్న భారీ ఈవెంట్‌ కు ప్రభాస్ హాజరు అవుతారని మొదట ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కంగువా సినిమా కోసం ప్రభాస్ వాయిస్ ఓవర్‌ ఇవ్వబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. తెలుగు వర్షన్ కు సంబందించిన మూవీలో ఆయన వాయిస్ అందించనున్నారని సమాచారం. ఈ వార్త కనుక నిజమైతే ఇక ఫ్యాన్స్ కి పూనకాలే.. అటు తమిళ అభిమానులు కూడా ఈ వార్త పై ఫుల్ ఖుషి అవుతున్నాయి.

ఇక తమిళ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూర్య ‘కంగువా’ మూవీని మొదట అక్టోబర్ 10 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల నవంబర్ 14 న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.. రజనీకాంత్‌ వేట్టయన్‌ మూవీ కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరీ ఆలస్యం కాకుండా వచ్చే నెలలో సినిమాను 30కి పైగా భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించగా.. తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌ సంస్థతో కలిసి నిర్మించింది. ఈ సినిమాకు ప్రస్తుతం జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఆ తర్వాత ‘పురాణనూరు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా పై త్వరలోనే మరో అప్డేట్ రానుందని సమాచారం..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×