E-Paper
Advertisement

Parineeti Chopra: కన్నీళ్లు ఆగడం లేదు.. ఎమోషనల్ అయిన బాలీవుడ్ బ్యూటీ

Parineeti Chopra: కన్నీళ్లు ఆగడం లేదు.. ఎమోషనల్ అయిన బాలీవుడ్ బ్యూటీ
Advertisement

Parineeti Chopra: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో డైరెక్ట్ సినిమా చేయకపోయినా కూడా అమ్మడుకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్ని బావుండి ఉంటే అనిమల్ లో రష్మిక స్థానంలో అమ్మడిని చూసేవాళ్ళం. కానీ, సందీప్ ఆమె ఆ పాత్రకు సెట్ కాదని తెలిసి కొంత షూటింగ్ తరువాత తొలగించి రష్మికను తీసుకున్నారు.

ఇక ఈ చిన్నది.. గతేడాది ఆప్ నాయకుడు రాఘవ్ చద్దాను ప్రేమించి పెళ్ళాడి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇకపోతే గత కొన్ని రోజులుగా పరిణీతి ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి అవన్నీ పుకార్లు అని కొట్టిపారేసింది. ప్రముఖ పంజాబీ సింగర్ అమర్ సింగ్ చంకీల బయోపిక్ గా తెరకెక్కిన అమర్ సింగ్ చంకీల సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

Advertisement

ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ అందుకోవడంతో పరిణీతి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.. ” ప్రస్తుతం ఇప్పటివరకు ఇంటికే పరిమితమయ్యాను. మీ మాటలు, మీ కాల్‌లు, సినిమా సమీక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విషయం చెప్పడానికి నాకు కన్నీళ్లు ఆగడం లేదు. “పరిణీతి ఈజ్ బ్యాక్.” ఈ మాటలు పెద్దగా మోగుతున్నాయి.. ఇలా నా గురించి ఆలోచిస్తారని అనుకోలేదు. అవును నేను తిరిగి వచ్చాను.. ఇక నేను ఎక్కడికీ వెళ్ళను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు ఆమెకు స్వాగతం పలుకుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×