Big Stories

CJI: న్యాయ వ్యవస్థలను అణగదొక్కాలని చూస్తున్నారు.. సీజేఐకు మాజీ జడ్జీల లేఖ

 

- Advertisement -

CJI: న్యాయవ్యవస్థను కాపాడాలని కోరుతూ 21 మందితో కూడిన సుప్రీం, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. న్యాయవ్యవస్థపై తీవ్ర ఒత్తిడి, తప్పుడు సమాచారాలతో అణగదొక్కేందుకు యత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా సంకుచిత రాజకీయ మరియు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు హానికరమని పేర్కొన్నారు. రాజకీయ ప్రముఖుల అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్న వారు న్యాయవ్యవస్థకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ తరుణంలో న్యాయవ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం కలుగుతుందని ఆరోపించారు. ఈ ప్రక్రియలు న్యాయవ్యవస్థ పనితీరును కించపరిచేలా ఉన్నాయని అన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే కోర్టులను వాడుకుంటున్నారని, ఇబ్బంది పెట్టేందుకు కొందరు యత్నిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఉద్దేశ్యపూర్వకంగానే ప్రకటనలు కూడా చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. కోర్టులను ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం ఈజీ అంటూ పలువురు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు 600 మంది లాయర్లు కలిపి లేఖను రాశారు.

అనవసన ఒత్తిళ్ల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాలని కోరారు. కోర్టుల తీర్పులను ప్రభావితం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ మేరకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News