E-Paper
Advertisement

Anchor Syamala: అక్కా.. నెక్స్ట్ ఏసేది నిన్నే.. జాగ్రత్తగా ఉండు

Anchor Syamala: అక్కా.. నెక్స్ట్ ఏసేది నిన్నే.. జాగ్రత్తగా ఉండు
Advertisement

Anchor Syamala: రాజకీయం.. సినిమా.. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. ఒకటి లేకపోతే మరొకటి ముందుకు వెళ్లదు. అది అందరికి తెల్సిన విషయమే. అయితే రాజకీయ నాయకులను నమ్ముకొని నటులు ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. ఈ మధ్యకాలంలో అది ఎక్కువ అవుతుంది.

నటులు.. ఎన్నికలు వచ్చాయి అంటే ప్రచారాల కోసం తిరుగుతూ ఉంటారు. దానికోసం డబ్బు తీసుకుంటారు.. ఏవేవో మాట్లాడతారు. అది అందరికి తెల్సిందే. కానీ, ఎన్నికలు అయ్యాక కూడా వారు అదే మాటలు మాట్లాడితే.. కొంచెం కష్టమే. అది కూడా గెలిచే పార్టీ అని తెలిసి కూడా అనడం మరింత తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

Advertisement

ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామో ఈపాటికి మీకు అర్ధమయ్యి ఉంటుంది. నేడు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం నుంచి కూడా కూటమి గెలుపు గట్టిగా వినిపిస్తూ ఉంది. దీంతో కూటమి అభిమానులు.. తమను విమర్శించిన ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి.. తాను చేసింది తప్పని, తన ప్రిడిక్షన్స్ తప్పుగా చెప్పానని, జగన్ గెలుస్తాడని చెప్పానని కానీ, అది అవ్వడాన్ని ఒప్పుకొని ఇంకెప్పుడు ప్రిడిక్షన్స్ చెప్పను అని వీడియో ద్వారా తెలిపాడు. ఇక దీంతో ఫ్యాన్స్ కొంతవరకు శాంతించారు.

ఇక ఇప్పుడు అందరి చూపు శ్యామల మీద పడింది. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన శ్యామల.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మెప్పించింది. ఈ ఎన్నికల్లో శ్యామల వైసీపీకి సపోర్ట్ గా నిలిచింది. చాలామంది సపోర్ట్ గా నిలిచారు.. కానీ, అమ్మడు చేసిన వ్యాఖ్యలు కొద్దిగా హద్దుమీరడంతో అందరి చూపు ఆమె మీద పడింది.

Advertisement

ఒక ఇంటర్వ్యూలో పవన్ గెలుపు గురించి మాట్లాడుతూ.. ” ఆవేశపడి ఆయాసపడటమే తప్ప, పవన్ కళ్యాణ్ గారు తోటివారికి సహాయపడుతుండగా నేనెప్పుడూ చూడలేదు.. సహాయ పడ్డట్టు నేనెక్కడా వినలేదు కూడా.. ఈసారి కచ్చితంగా జగన్ గెలుస్తాడు” అని చెప్పుకొచ్చింది. ఈ మాటలకూ పవన్ ఫ్యాన్స్ గట్టిగా హర్ట్ అయ్యారు. ఇప్పుడు పవన్ గెలిచాడు. 21స్థానాల్లో 20 స్థానాలను కైవసం చేసుకున్నాడు.

ఇప్పటికే పవన్ పై విమర్శలు చేసిన వేణుస్వామి పరిస్థితి ఎలా మారిందో అందరికి తెల్సిందే .. ఇక ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ టార్గెట్ శ్యామలక్కనే అని తెలుస్తోంది. ఈ వీడియోను షేర్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ.. అక్కా.. నెక్స్ట్ ఏసేది నిన్నే.. జాగ్రత్తగా ఉండు కామెంట్స్ చేస్తున్నారు. మరి అమ్మడు ఈ ట్రోలింగ్ ను తట్టుకుంటుందో లేదో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×