BigTV English

Realme 13 Pro Series: అన్ని ఒకేసారి.. రియల్‌మీ నుంచి రెండు ఫోన్లు.. కొంటే ఇలాంటివే కొనాలి!

Realme 13 Pro Series: అన్ని ఒకేసారి.. రియల్‌మీ నుంచి రెండు ఫోన్లు.. కొంటే ఇలాంటివే కొనాలి!

Realme 13 Pro Series: Realme తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తోంది. కొన్ని రోజుల క్రితం కంపెనీ భారత్ మార్కెట్‌లో Realme GT 6Tని విడుదల చేసింది. మరోవైపు కంపెనీ ఈ నెల 20న Realme GT 6ని లాంచ్ చేయనుంది. Realme GT 6 లాంచ్ చేయడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే Realme కొత్త Pro స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో Realme 13 Pro, Realme 13 Pro + అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది.


ఫోన్ లాంచ్ తేదీ గురించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. Realme 13 Pro+ స్పెసిఫికేషన్‌లు, కలర్స్ గురించి కొంత సమాచారం లీక్ అయింది. ఇప్పుడు Realme 13 Pro స్పెసిఫికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. Realme ఈ ఫోన్‌లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

Also Read: వాయమ్మో.. రూ.70వేల ఫోన్‌పై సూపర్ డిస్కౌంట్.. మాములుగా లేదు!


నివేదికల ప్రకారం ఫోన్ మోడల్ RMX3990. ఈ మోడల్ నంబర్‌తో ఫోన్ భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఇది నాలుగు వేరియంట్‌లలో వస్తుంది. ఇవి వరుసగా 8 GB+128 GB, 8 GB+256 GB, 12 GB+256 GB, 12 GB+512 GB స్టోరేజ్‌తో వస్తాయి. ఈ ఫోన్ మోనెట్ గోల్డ్, మోనెట్ పర్పుల్, స్కై గ్రీన్ వంటి కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. కంపెనీ ఈ వేరియంట్లలో Realme 13 Pro+ని కూడా లాంచ్ చేయబోతోంది. ఇది మోనెట్ గోల్డ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Also Read: ఆఫర్లొచ్చాయ్ మావ.. ఐఫోన్, పిక్సెల్ ఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్.. ఇది అసలు ఊహించలేదు!

అంతే కాకుండా ఈ కొత్త ఫోన్‌లు Realme 12 Pro, 12 Pro+  రీబ్రాండెడ్ వెర్షన్‌లుగా తీసుకొచ్చే అవకాశం ఉంది.ఈ ఫోన్ మోడల్ నంబర్ RMX3992.  Realme 12, 12 Pro+ ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లు 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో పాటు 32-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌ కెమెరాలు కలిగి ఉన్నాయి. Realme 13 Pro+ స్మార్ట్‌ఫోన్ పెరిస్కోప్ కెమెరాతో కూడా వస్తుందని సమాచారం. కంపెనీ 13 ప్రోలో పెరిస్కోప్ కెమెరాను అందిస్తో లేదో చూడాల్సి ఉంది. కంపెనీ ఈ కొత్త సిరీస్‌ని జూలైలో మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

Tags

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×