E-Paper
Advertisement

Pawan Kalyan: OG సెట్ లో అడుగుపెట్టబోతున్న పవన్.. ?

Pawan Kalyan: OG సెట్ లో అడుగుపెట్టబోతున్న  పవన్.. ?
Advertisement

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెల్సిందే. ఇక పవన్ రాజకీయాల్లోకి రావడంతో ఆయన సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ చివరకు వచ్చింది. జ్యోతికృష్ణ మిగిలిన భాగానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఇది కాకుండా పవన్ నటిస్తున్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొంతవరకు షూటింగ్ ను ఫినిష్ చేసింది. అయితే ఎక్కువ భాగం ఇంకా షూటింగ్ చేయాల్సి ఉంది. హరీష్.. ఒకపక్క పవన్ లేని భాగానంత ఫినిష్ చేసేస్తున్నాడు. ఎప్పుడైతే పవన్ వస్తాడో అప్పుడు ఆయన పార్ట్ ను కంప్లీట్ చేయనున్నాడు.

Advertisement

ఇక ఈ రెండు సినిమాలకన్నా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా OG. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలను పెట్టుకున్నారు. ఇక డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇక OG సైతం సగానికి పైగా షూటింగ్ ను పూర్తిచేసుకుంది.

అందుతున్న సమాచారం ప్రకారం పవన్ మరికొద్దిరోజుల్లో OG సెట్ లో అడుగుపెట్టనున్నాడట. నిర్మాతకు పవన్ మొదట OG ని ఫినిష్ చేస్తానని ఇప్పటికే మాట ఇచ్చాడట.దీంతో మేకర్స్ ఎప్పుడు పవన్ వచ్చినా షూటింగ్ స్టార్ట్ అయ్యేలా చకచకా ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉన్నారట. అలా షూటింగ్ అవ్వడమే.. ఇలా ప్రమోషన్స్ షురూ అయిపోవడం ఖాయం. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×