BigTV English
Advertisement

New Renault Duster Launched: కొత్త డస్టర్ లాంచ్.. పిచ్చెక్కిస్తున్న ఫీచర్లు!

New Renault Duster Launched: కొత్త డస్టర్ లాంచ్.. పిచ్చెక్కిస్తున్న ఫీచర్లు!

New Renault Duster Launched: కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ తన సరికొత్త డస్టర్‌ను టర్కీలో విడుదల చేసింది. ఈ కొత్త డస్టర్‌ను టర్కిష్ ప్లాంట్‌లో తయారు చేశారు. కొత్త జనరేషన్ డస్టర్ ప్రారంభ ధర 1,249,000 టర్కిష్ లిరా (సుమారు రూ. 32 లక్షలు)గా ఉంటుంది. ఈ ధరలు టాప్ వేరియంట్ కోసం 1,580,000 లిరా (సుమారు రూ. 40 లక్షలు) వరకు పెరుగుతాయి. వచ్చే ఏడాది నాటికి ఇది భారత మార్కెట్‌లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో అనేక ప్రీమియం ఫీచర్లను చూడొచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


కొలతల పరంగా డాసియా డస్టర్, రెనాల్ట్ డస్టర్ రెండూ చాలా పోలి ఉంటాయి. రెనాల్ట్ డస్టర్ పొడవు 4,343mm, వీల్ బేస్ 2,658mm. డాసియా, రెనాల్ట్ వెర్షన్‌లకు గ్రౌండ్ క్లియరెన్స్ 209 నుండి 217mm వరకు ఉంటుంది. డాసియా డస్టర్‌తో పోలిస్తే, కొత్త రెనాల్ట్ డస్టర్‌లో స్టైలింగ్, ఫీచర్లలో కొన్ని మార్పులు ఉంటాయి. ఫ్రంట్ ఫాసియా ప్రత్యేకంగా దీన్ని చూపుతుంది. రెనాల్ట్ డస్టర్ రేడియేటర్ గ్రిల్‌ను ఉపయోగిస్తుంది. రాంబస్ ఆకారపు లోగో బోల్డ్‌లో రెనాల్ట్ టెక్స్ట్‌తో ఉంటుంది.

Also Read: Best Low Budget Bikes: ధర తక్కువ.. మైలేజ్ చాలా ఎక్కువ.. బెస్ట్ బైకులు ఇవే!


కొత్త తరం రెనాల్ట్ డస్టర్ ప్రీమియం ఫీచర్లతో విడుదల చేశారు. ఇది 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. సేఫ్టీ ప్యాకేజీలో ఫ్రంట్, సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, రోడ్ సైడ్ రికగ్నిషన్, లేన్ డిపార్చర్ వార్నింగ్ ఉన్నాయి. ఇది ఎవల్యూషన్, టెక్నో అనే రెండు ట్రిమ్‌లలో వస్తుంది. బేస్ ట్రిమ్‌లో 17-అంగుళాల వీల్స్, LED లైట్లు, వెనుక డ్రమ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

డస్టర్ టెక్నో వేరియంట్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు అనేక ఆప్షన్ ఫీచర్‌లను కూడా పొందుతారు. వీటిలో 18-అంగుళాల వీల్స్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా ఉన్నాయి. క్యాబిన్ ఎంపికలలో హీట్ జనరేటెడ్ స్టీరింగ్ వీల్, సీట్లు, ఇంటర్నల్ LED లైట్లు, హుక్స్, గాడ్జెట్ హోల్డర్లు ఉన్నాయి. టెక్నోలో ఫాగ్ లైట్లు, ఆల్-4 డిస్క్ బ్రేక్‌లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్ స్విచింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండర్డ్‌గా అందించబడ్డాయి.

Also Read: 7 Seater Cars At Half Price: హైదరాబాద్‌లో సగం ధరకే కార్లు.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్.. సింపుల్‌గా కొనేయండి!

దీని బేస్ వేరియంట్‌లో మూడు-సిలిండర్ 1.0 TCe LPG ఇంజన్ ఉంటుంది. ఇది గ్యాసోలిన్, ప్రొపేన్ రెండింటికి సపోర్ట్ ఇచ్చే డ్యూయల్ ఇంజన్ కలిగి ఉంటుంది. దీని పీక్ పవర్ అవుట్‌పుట్ 100 hp. ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంది. రెండవ వేరియంట్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ హైబ్రిడ్ ఇ-టెక్ పవర్‌ట్రెయిన్. ఇది ఒక ఎలక్ట్రిక్ మోటార్, 1.6-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. దీని కంబైన్డ్ పవర్ అవుట్‌పుట్ 145 hp. మరొక హైబ్రిడ్ సెటప్ఇ ది 130 hp రిలీజ్ చేస్తుంది. ఇది 1.2 TCe టర్బో పెట్రోల్ ఇంజన్, 48-వోల్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కలిగి ఉంది. ఈ పవర్‌ట్రెయిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

Related News

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Big Stories

×