BigTV English

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు న్యూయర్ సర్ ప్రైజ్.. అదిరిపోయే అప్డేట్…

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు న్యూయర్ సర్ ప్రైజ్.. అదిరిపోయే అప్డేట్…

Hari Hara Veera Mallu: ఏపీ డిప్యూటీ సీఏం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎందగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్‍డేట్ల కోసం నిరీక్షిస్తున్నారు. గత ఏడాది ఈ మూవీ రిలీజ్ అవుతుందని అందరు అనుకున్నారు కానీ ఎన్నికల కారణంగా పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనలేదు. దాంతో మూవీ పెండింగ్ ఉంది. అందుకే సినిమాలు అనుకున్న టైం కు రిలీజ్ చెయ్యలేకపోయారు. ఈ మూవీ నుంచి న్యూయర్ సర్ ప్రైజ్ ను ఫ్యాన్స్ కు ఇచ్చారు మేకర్స్.. జనవరి 1న మూవీ టీమ్ అదిరిపోయే విషయం చెప్పింది. తొలి పాట రిలీజ్ డేట్, టైమ్ వెల్లడించింది. ఈ పాటను స్వయంగా పవన్ కల్యాణ్ పాడారు. కొత్త పోస్టర్‌తో పాటు సాంగ్ వివరాలను ఆ పోస్టర్ లో పేర్కొన్నారు. ఆ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి..


హరి హర వీరమల్లు మూవీ నుంచి ‘మాట వినాలి’ అంటూ తొలి సాంగ్ రానుంది. ఈ పాట జనవరి 6వ తేదీన ఉదయం 9 గంటల 6 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు అధికారికంగా అనౌన్స్ చేసింది. 2025 పవర్ ప్యాక్డ్‌గా ఉండనుంది. హరి హర వీరమల్లు నుంచి తొలి పాటతో కొత్త సంవత్సరాన్ని సెలెబ్రేట్ చేసుకోండి. ఫస్ట్ సాంగ్ జనవరి 6వ తేదీ ఉదయం 9:06 గంటలకు వస్తుందని ఆ మూవీ ప్రొడక్షన్ టీమ్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా తన గాత్రంతో పాడారని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో అదిరిపోయే అప్‍డేట్ ఇచ్చారు. జనవరి 6న వచ్చే ఈ పాట కోస పవర్ స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఈ పాట అనౌన్స్మెంట్ తో పాటుగా పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ యోధుడు గా కనిపిస్తున్నారు. చలిమంట దగ్గర కూర్చున్నాడు. ఈ పోస్టర్ అట్రాక్టివ్‍గా ఉంది. ఇక ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 28వ తేదీన విడుదల అవుతుందని ఈ పోస్టర్‌లో మరోసారి కన్ఫర్మ్ చేసింది వీరమల్లు టీమ్..

ఈ మూవీకి మొదటగా డైరెక్టర్ క్రిష్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఆయనను నిర్మాతలు తప్పించారు. ప్రస్తుతం ఈ మూవీకి నిర్మాత కుమారుడు జ్యోతికృష్ణ దర్శకుడిగా ఉన్నారు. మొఘలుల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో పీరియడ్ యాక్షన్ మూవీగా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం ఇంకా 8 రోజుల షూటింగే పెండింగ్‍లో ఉందని పవన్ ఇటీవల చెప్పారు. హరి హర వీరమల్లు మూవీలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, విక్రమ్‍జీత్ విర్క్, నోరా ఫతేహి కీలకపాత్రలు పోషిస్తున్నారు..


ఇక గత ఏడాది ఎన్నికల ముందు వరుస సినిమాలను అనౌన్స్ చేశారు. డిప్యూటీ సీఏం అయ్యాక సినిమాలకు సమయం కేటాయించలేరు. ఓజీ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సుజిత్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేయాల్సి ఉంది. దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×