BigTV English

Formula E Car Race Case: క్షణ క్షణం.. భయం భయం

Formula E Car Race Case: క్షణ క్షణం.. భయం భయం

* భయం గుప్పిట్లో బతుకుతున్న కేటీఆర్
– ఫార్ములా ఈ – రేస్ వ్యవహారం
– హైకోర్టులో వాడీవేడిగా వాదనలు
– కేటీఆర్ తప్పేం లేదన్న ఆయన తరఫు కాస్ట్లీ లాయర్
– మంత్రి హోదాలో సంతకం పెట్టారని వాదన
– కేటీఆర్ లాయర్ వాదనలపై సర్వత్రా చర్చ
– నష్టాలొచ్చాయని తెలిసినా కేటీఆర్ సంతకం ఎందుకు చేశారు?
– పైగా, రూ.700 కోట్ల లాభాలు అంటూ డ్రామాలెందుకు?
– అసలు, కొత్త కంపెనీకి స్పాన్సర్‌షిప్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేంటి?
– నష్టాలొచ్చి తప్పుకుంటే, ప్రభుత్వం స్పాన్సర్ చేయడం ఏంటి?
– రూ.600 కోట్ల అగ్రిమెంట్ల వెనుక లెక్కలేంటి?
– తెరపైకి అనేక అనుమానాలు.. అన్ని కోణాల్లో ఏసీబీ దర్యాప్తు
– ఇంకోవైపు వెంటాడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: ఫార్ములా ఈ – రేస్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. తాజా వాదనల్లో మాజీ మంత్రి కేటీఆర్ ‘సాంప్రదాయని.. సుప్పిని.. సుద్దపూసని’ అనే రేంజ్‌లో కలరింగ్ ఇచ్చారు ఆయన తరఫు కాస్ట్లీ లాయర్ సిద్ధార్థ్ దవే. మంత్రి హోదాలో కేటీఆర్ సంతకం పెట్టారని కేసు పెడితే దేశం ఇక ఏ మంత్రి కూడా ఫైళ్ల మీద సంతకాలు చేయరని అన్నారు. అంతేకాదు, కేటీఆర్‌పై 409 సెక్షన్ అమలైతే దేశంలో గందరగోళం నెలకొనే ఛాన్స్ ఉందని వాదించారు. అయితే, సిద్ధార్థ్ దవే వాదనలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చేయాల్సిందంతా చేసి, డబ్బులు ఇచ్చాను, అరెస్ట్ చేసుకోండి అంటూ మీడియా ముందు మాట్లాడిన కేటీఆర్, ఇప్పుడు కోర్టు ద్వారా తప్పించుకునేందుకు చూస్తున్నారని తెగ మాట్లాడుకుంటున్నారు. ఇటు ఏసీబీ కూడా దేన్నీ వదలకూడదనే ధోరణిలో ముందుకెళ్తోంది.


అన్ని కోణాల్లో ఏసీబీ కసరత్తు

బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2023 ఫిబ్రవరి 11న ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫార్ములా ఈ – రేస్ పోటీలు జరిగాయి. ఈ ఈవెంట్ నిర్వాహక సంస్థగా గ్రీన్ కో(ఏస్ నెక్స్ట్ జెన్) వ్యవహరించింది. ఈ పోటీల కోసం ఫార్ములా ఈ ఆపరేషన్స్(ఎఫ్ఈవో), ఏస్ నెక్స్ట్ జెన్, పురపాలక శాఖ మధ్య ట్రై పార్ట్ అగ్రిమెంట్ జరిగింది. 9,10,11,12 సీజన్ల కార్ రేసులు జరిగేలా ఒప్పందం కుదిరింది. 9వ సీజన్ 2023 ఫిబ్రవరిలో జరిగింది. 10వ సీజన్ 2024లో ఫిబ్రవరిలో జరపాలని అనుకున్నారు. కానీ, ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ ముందుకు రాలేదు. తమకు నష్టం వచ్చిందని వెనుకడుగు వేసింది. అయితే, నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయని తెలిసినా, మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఎఫ్‌ఈవోతో కలిసి హెచ్ఎండీఏను ప్రమోటర్‌గా పెట్టి ముందుకు వెళ్లారు.

త్రైపాక్షిక అగ్రిమెంట్ కాస్తా, తర్వాత ద్వైపాక్షిక ఒప్పందంగా మారింది. ఎప్పుడైతే ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకుందో అక్కడి నుంచే కథ అడ్డం తిరిగిందని స్పష్టంగా అర్థం అవుతోంది. అయినా కూడా కేటీఆర్ పంతానికి పోయి, మళ్లీ గెలుస్తామన్న గుడ్డి నమ్మకంతో వరుస ఈవెంట్ల కోసం ముందుకు వెళ్లారు. 2023 అక్టోబర్ 5న రూ.23 కోట్లు, 11న మరో రూ.23 కోట్లు హెచ్ఎండీఏ ద్వారా చెల్లించారు. పన్నుల రూపంలో ఇంకో రూ.9 కోట్లు ఎగస్ట్రా ఖర్చు అయింది. ఈ లెక్కల చుట్టూ ఇప్పుడు కేసు నడుస్తున్నా, ఈ అగ్రిమెంట్ వ్యవహారంలో చాలా కోణాలు ఉన్నాయనేది ఏసీబీ వాదన. అందుకే అన్ని కోణాల్లో విచారించేందుకు కసరత్తు చేస్తోంది.

రూ.600 కోట్లకు టెండర్

ఫార్ములా ఈ – రేస్ మాటున కుట్రపూరిత అగ్రిమెంట్లు జరిగాయని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. మూడేండ్లకు రూ.600 కోట్ల దాకా అగ్రిమెంట్లు చేసుకున్నట్టు గుర్తించింది. దీనిపై ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. పైగా, అనధికారికంగా రూ.46 కోట్లు, పన్ను రూపంలో ఇంకో రూ.9 కోట్లు తగలేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిందని, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇప్పటికే చెప్పారు. కేటీఆర్ కూడా దీన్ని ఒప్పుకున్నారు.

కానీ, ప్రెస్ మీట్‌లో చూపిన ధైర్యం తర్వాత చూపించలేదు. కోర్టును ఆశ్రయించి, అరెస్ట్ కాకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీన్నిబట్టే ఆయన తప్పు చేశారన్నది తేలిపోయిందని కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అసలు, రూ.600 కోట్ల తతంగం ఏంటి? దాని వెనుక ఏం జరిగింది? 2022లో పుట్టిన చిన్న కంపెనీకి ప్రాజెక్ట్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? కార్ రేస్ వల్ల బ్రాండ్ ఇమేజ్ పెరిగి వందల కోట్ల లాభాలు వచ్చాయని చెప్పిన కేటీఆర్, స్పాన్సర్ సంస్థకు నష్టాలు ఎందుకొచ్చాయో చెప్పగలరా? స్పాన్సర్‌కు నష్టాలొస్తే ప్రభుత్వానికి వచ్చినట్టు కాదా? ఇలా అనేక అనుమానాలతో అన్ని కోణాల్లో నిజానిజాలు బయటపెట్టేందుకు ఏసీబీ కసరత్తు జరుపుతోంది.

ఏస్ నెక్స్ట్ జెన్ కథేంటి?

ఫార్ములా ఈ – రేస్ కోసం ట్రై పార్ట్ అగ్రిమెంట్ జరిగింది. అయితే, ఏస్ నెక్స్ట్ జెన్‌ను ఎంపిక చేయడం వెనుక అనేక అనుమానాలున్నాయి. ఇది గ్రీన్‌ కో ప్రమోటర్స్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ. గ్రీన్ కో సంస్థకు సంబంధించిన సబ్సిసిడరీ కాదు. ఇదో వ్యక్తిగత కంపెనీ. స్టార్టింగ్ షేర్ క్యాపిటల్ 2 లక్షల రూపాయలే. ఇంత తక్కువ షేర్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ – రేస్‌ను ప్రమోట్ చేస్తానని చెప్పగానే, అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎలా నమ్మిందనేది పెద్ద ప్రశ్న. స్పాన్సర్ అంటే డబ్బులు పెట్టుబడిగా పెట్టాలి. అన్ని ఈవెంట్లకు ఖర్చు చేస్తామని ముందుకొచ్చింది ఏస్ నెక్స్ట్ జెన్. కానీ, మొదటి రేసుకే నష్టాలు రావడంతో ఈ కొత్త కంపెనీ వెనక్కి వెళ్లడంతో సమస్య మొదలైంది.

అయితే, ఏస్ నెక్స్ట్ జెన్ మధ్యలోనే డ్రాప్ అయితే, ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది కేటీఆర్ ఇంతవరకు సమాధానం చెప్పలేదు. పైగా, పంతానికి పోయి తర్వాత ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తుందని చక్రం తిప్పారు. మొదటి అగ్రిమెంట్ యాక్టివ్‌గా ఉండగానే, రెండో అగ్రిమెంట్ ప్రకారం రూ.46 కోట్లు చెల్లించారనే అనుమానాలున్నాయి. వీటన్నింటిపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఇంకోవైపు, ఈడీ కూడా రంగంలోకి దిగింది.

చేయాల్సిందంతా చేసి, కోర్టు ద్వారా తప్పించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారనేది కాంగ్రెస్ నేతల వాదన. పైగా, తన కేసును వాదించేందుకు బడా లాయర్లను రంగంలోకి దింపారని అంటున్నారు. గతంలోనూ ఇదే తరహాలో అధిక మొత్తంలో ఖర్చు చేసి ఢిల్లీ లాయర్లతో తప్పించుకునేందుకు చూశారని గుర్తు చేశారు. ఇప్పుడు క్షణ క్షణం భయం భయంగా బతుకుతున్న కేటీఆర్, తన ఆర్డర్ ఎప్పుడు వస్తుందోనని వణికిపోతున్నారని సెటైర్లు వేస్తున్నారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×