BigTV English

Pawan Kalyan Heroine: అఖిల్ హీరోయిన్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan Heroine: అఖిల్ హీరోయిన్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌


Pawan Kalyan Heroine: అఖిల్ అక్కినేని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న చిత్రం ఏజెంట్‌. ఈ మూవీ డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సాక్షి వైద్యకి అనుకోని షాక్ త‌గిలింది. ఏజెంట్ హిట్ అయ్యుంటే ఆమెకు చాలా ప్ల‌స్ అయ్యుండేది. కానీ రిజ‌ల్ట్ రివర్స్ కొట్ట‌డంతో అమ్మ‌డుకి ఏం చేయాలో పాలు పోలేదు. ఇదే స‌మ‌యంలో ఆమెకు అనుకోని ఆఫ‌ర్ ఒక‌టి త‌లుపు కొట్టింది. అది కూడా బిగ్గెస్ట్ స్టార్ సినిమాలో. ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు.. .ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా హ‌రీష్ శంక‌ర్ దర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’. కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్‌. ఓ హీరోయిన్‌గా ఇప్ప‌టికే శ్రీలీల క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది. మ‌రో హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకుంటార‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న త‌రుణంలో ఆ అవ‌కాశం సాక్షి వైద్య‌కు వ‌చ్చింద‌ని సినీ స‌ర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. త‌మిళ చిత్రం ‘తెరి’కి ఇది రీమేక్. తెరిలో విజ‌య్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుంటే అదే రోల్‌ను రిపీట్ చేస్తూనే మ‌రో షేడ్‌ను మాత్రం హ‌రీష్ శంకర్ పూర్తిగా మార్చేశారు. త‌మిళంలో విజ‌య్ బేక‌రి య‌జ‌మానిగా న‌టిస్తే.. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లెక్చ‌ర‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో హీరోయిన్‌గా శ్రీలీల క‌నిపించ‌నుంది. మ‌రో హీరోయిన్‌గా సాక్షి వైద్య క‌నిపించ‌నుంది.

గ‌బ్బ‌ర్ సింగ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హరీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా రూపొందుతుండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పీక్స్‌లో ఉన్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రీసెంట్‌గా వ‌చ్చిన ఈ సినిమా గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల‌ను పీక్స్‌కి తీసుకెళ్లాయి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×