BigTV English

CM Jagan: రాజ్‌భవన్ వెళ్లిన జగన్.. ఏంటి సంగతి?

CM Jagan: రాజ్‌భవన్ వెళ్లిన జగన్.. ఏంటి సంగతి?
cm jagan governor

Today jagan meeting schedule(Latest telugu news in ap): ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో సీఎం జగన్‌ భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. గవర్నర్‌ను అకస్మాత్తుగా కలవడంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


అక్టోబర్‌లోనే తెలంగాణకు ఎన్నికలు జరగనుండగా.. ఈ క్రమంలోనే జగన్ నుంచి ఊహించని నిర్ణయం ఏమైనా ఉండబోతోందా? అనే చర్చ జరుగుతోంది. మంగళవారం టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్‌తో ఏపీ సీఎం జగన్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. జగన్‌ భేటీ సాధారణమేనా..? లేదా మరేమైనా బలమైన కారణం ఉందా..? అనే ఉత్కంఠ నెలకొంది. లేదంటే టీడీపీ ఫిర్యాదుపై వివరణ ఇచ్చేందుకే సీఎం వెళ్లారా.. అనే టాక్‌ నడుస్తోంది. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే చర్చ నడుస్తోంది.

ఇటీవల విశాఖ ఎంపీ కుమారుడు, భార్య కిడ్నాప్‌ ఉదంతంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు..? గవర్నర్‌తో జగన్ భేటీ సాధారణమేనా..? ప్రత్యేకమైన కారణం ఉందా..? అనేది తెలియాల్సి ఉంది.


గవర్నర్‌ను కలిసే ముందు.. పనితీరు బాగాలేదని వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్‌ తీసుకున్నారు సీఎం జగన్. అక్టోబర్‌లో సర్వే రిపోర్టులు వస్తాయని.. నివేదికను బట్టే ఎమ్మెల్యేలకు టికెట్లు వస్తాయన్న స్పష్టం చేశారు. గడప గడపకు పనితీరుపైనా జగన్ అసంతృప్తి వెలిబుచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోలేదన్నారు. అలాగే ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. ఆ మీటింగ్ ముగిసిన వెంటనే జగన్.. రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌ను అబ్దుల్ నజీర్‌ను కలవడం ఆసక్తి రేపుతోంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×