E-Paper
Advertisement

Pawan kalyan ‘OG’ movie update : ‘ఓజీ’లో పవన్ తండ్రి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో..

Pawan kalyan ‘OG’ movie update : ‘ఓజీ’లో పవన్ తండ్రి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో..
Advertisement
Pawan Kalyan

Pawan Kalyan ‘OG’ movie update : ఒకప్పుడు బాలీవుడ్‌తో పోలిస్తే.. టాలీవుడ్‌ను చాలా చిన్నచూపు చూసేవారు. తెలుగు సినిమాల్లో నటించడానికి హిందీ హీరోయిన్లు సైతం ఇష్టపడేవారు కాదు. కానీ రోజులు మారిపోయాయి. టాలీవుడ్ నుండి అవకాశం వస్తే ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎందరో బాలీవుడ్ నటీనటులు ప్రకటించారు. అందుకే ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్స్ సంఖ్య ఎక్కువయిపోయింది. తాజాగా పవన్ కళ్యాణ్ చిత్రంలో ఏకంగా ఇద్దరు బాలీవుడ్ తారలు ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.

Advertisement

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రయాణాన్ని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడుంటే అక్కడే సెట్ వేసి సినిమాల షూటింగ్ పూర్తి చేయడానికి మేకర్స్ సైతం ఒప్పుకోవడంతో ప్రస్తుతం పవన్ రెండు పడవలపై ప్రయాణిస్తున్నారు. ముందుగా తను సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఓజీ’ షూటింగ్‌ను పూర్తిచేసే పనిలో పడ్డాడు. దాంతో పాటు ‘బ్రో’ కూడా లైన్‌లో ఉంది. ఈ రెండు సినిమాల నుండి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఫ్యాన్స్‌ను పలకరిస్తున్నాయి.

చేసింది తక్కువ సినిమాలే అయినా సుజిత్ దర్శకత్వం అంటే యూత్‌లో బాగా క్రేజ్ ఉంది. తన మేకింగ్‌ను నమ్మి స్టార్ హీరోలు సైతం తనతో సినిమాలు చేయడానికి ఒప్పుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ‘ఓజీ’తో తనకు ఛాన్స్ ఇచ్చాడు. సినిమా ఫస్ట్ లుక్ విడుదలయినప్పటి నుండే ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇందులో ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ లాంటి క్యాస్టింగ్ చూసి వారు అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఇమ్రాన్ హష్మీతో పాటు మరో బాలీవుడ్ నటుడు కూడా ఓజీలో నటించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బాచ్చన్.. తెలుగు హీరోలతో ఎంత సన్నిహితంగా ఉన్నా.. తెలుగు సినిమాల్లో నటించడానికి మాత్రం ఎప్పుడూ ముందుకు రాలేదు. గత కొన్నేళ్లుగా స్టార్ హీరోల సినిమాల్లో నటించడానికి అమితాబ్ ఒప్పుకుంటున్నారు. సైరా నటించిన తర్వాత ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్ కెలో యాక్ట్ చేస్తున్నాడు బిగ్ బి. ఇప్పుడు పవన్ ఓజీలో కూడా హీరో తండ్రి పాత్రలో అమితాబ్ కనిపించనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే.. ఈ సినిమాకు మరింత హైప్ యాడ్ అయినట్టే అనుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×