E-Paper
Advertisement

Pawan Kalyan : పవర్ స్టార్ సినిమాల అప్‌డేట్స్‌.. ఒకేరోజు రెండు సర్‌ప్రైజ్‌లు.. ఫ్యాన్స్ లో జోష్..

Pawan Kalyan : పవర్ స్టార్ సినిమాల అప్‌డేట్స్‌.. ఒకేరోజు రెండు సర్‌ప్రైజ్‌లు.. ఫ్యాన్స్ లో జోష్..
Advertisement

Pawan Kalyan Movie Updates(Latest Tollywood news) : బీమ్లా నాయక్ తో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన పవర్ స్టార్ ఆ తర్వాత ఇప్పటి వరకు మరో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్‌లు చివరి దశలో ఉన్నాయి. మరికొన్ని మూవీల చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. పవన్ ఫ్యాన్స్ ఈ మూవీస్ అప్‌డేట్స్‌ కోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూనే ఉంటున్నారు. అలాంటి అభిమానులను సర్ ఫ్రైజ్ చేస్తూ రెండు చిత్రాల అప్‌డేట్స్‌ ఒకే రోజు బయటకు వచ్చాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

Advertisement

పవన్‌ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజీత్‌ తెరకెక్కిస్తున్న సినిమా OG. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ముంబైలో పూర్తయింది. మరో షెడ్యూల్‌ను కూడా ప్రారంభించామని OG టీమ్ ట్వీట్‌ చేసింది. ఈ షెడ్యూల్ పుణెలో జరుగుతోందని వెల్లడించింది. ఇందులో ప్రియాంక మోహన్‌ పాట ఉందని తెలుస్తోంది. OG మూవీకి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

మరోవైపు OGలో అకీరా నందన్‌ నటిస్తున్నాడనే వార్త కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ సినిమాలో పవన్‌ 3 పాత్రలు పోషిస్తున్నాడని సమాచారం. అందులో టీనేజ్‌ రోల్‌లో పవన్‌కు బదులు అకీరాను చూపించాలని సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నాడని టాక్‌ వినిపిస్తోంది.

Advertisement

హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్ లో పవన్‌ నటిస్తున్న సినిమా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌కు సిద్ధమవుతుందని నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. ఇదే విషయాన్ని హరీశ్‌ శంకర్‌ కూడా తెలిపాడు. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నాడు. ఈ మూవీ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పవన్ తాజాగా నటిస్తున్న మూవీలన్నీ ఏడాది లోపే విడుదలవుతాయని తెలుస్తోంది. అంటే ఒక్క ఏడాదిలో 3 సినిమాలతో పవన్ అలరించే అవకాశం ఉంది. గతంలో ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా సరే విడుదలకావాలని కోరుకున్న అభిమానులకు పండగే కదా..!

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×