Big Stories

Wooden Sills :- ఇంటికి చెక్క బదులు సిమెంట్ గుమ్మాలు పనిచేయవా…

- Advertisement -

Wooden Sills :- భారత సంప్రదాయంలో ఇంటి గడపలకి ఎంతో విశిష్టత. ప్రతీ ఇంటిలో గదికి గదికి గడపలు ఉండే రోజులు కావివి. గతంలో గడపను లక్ష్మీదేవిగా భావించే వారు. అందుకే గడపకి బొట్లు పెట్టి పూజించేవారు. ముఖ్యంగా ప్రధాన ద్వారం దగ్గర గడపను పవిత్రంగా చూసుకుంటారు. పర్వదినాలు, పండుగ రోజులు, శుక్రవారాల నాడు గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేస్తుంటారు. ఇవన్నీ చెక్క గుమ్మాలైతే సాధ్యమవుతుంది. . ఈ రోజుల్లో సిమెంటు గుమ్మాలను వాడుతున్నారు. చెక్క ఖరీదు కావడం, నాణ్యమైన చెక్క దొరకపోవడం వంటి కారణాలతో కొంతమంది ఆలోచనలో మార్పు వచ్చింది. కానీ చెక్క గుమ్మానికి ఉన్న విశిష్టత సిమెంటు గుమ్మాలకి, గడపలకి ఉండవు…

- Advertisement -

ఈ రోజుల్లో కట్టే ఇళ్లకు ఒక్కటే గుమ్మం లేదా గడప ఉంటుంది. మిగిలిన వాటిని గుమ్మాలు ఉండటం లేదు. మాస్టర్ బెడరూం, చిల్డ్రన్ బెడ్ రూం దేనీకి గడపలు ఉండటం లేదు. గడప అంటే ఇంటికి హద్దులాంటిది. అలాంటి గుమ్మాన్ని పవిత్రంగా చూడాలి. కొత్త కోడలి ఇంటికి లోపలికి అడుగు పెట్టే సమయంలో గుమ్మం మీద రాగి చెంబులో పెట్టిన గోధుమల్ని కాలితో తన్ని వెళ్లడం ద్వారా ఇల్లంతా పరుచుకుంటాయి. ప్రతీ శుక్రవారం గడపకి ముగ్గులు పెట్టి పూజించే సంప్రదాయం ఉంది. గుమ్మం దాటే టప్పుడు తుమ్మినా, గుమ్మం మీద కూర్చున్నా, మంచిది కాదంటారు. గుమ్మం మీద కాలు కూడా పెట్టదని పెద్దలు చెబుతుంటారు. గడప మీద కాలు వేస్తే పాపమని వారిస్తుంటారు.

గడపని ల క్ష్మీదేవిగా భావించడం వల్ల పెద్దలు ఇలాంటి ఆచారాలు పెట్టారు. గుమ్మం అనేది దుష్ట శక్తుల్ని లోపలికి రాకుండా నిలువరిస్తుందని నమ్మకం. ఇంటికి ఎవరు వచ్చినా గుమ్మం ద్వారానే లోపలికి రావాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి గుమ్మాల విషయంలో పద్దతి, సంప్రదాయం పాటించాలని అంటారు. ఇంటికి నరఘోష తలగకూడదనుకుంటే శుక్రవారం నాడు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నల్లటి పటిక కడితే దిష్ఠి పోతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News