E-Paper
Advertisement

Pawan Sagar: జ‌న‌సేన‌లోకి మొగలి రేకులు హీరో సాగ‌ర్‌

Pawan Sagar: జ‌న‌సేన‌లోకి మొగలి రేకులు హీరో సాగ‌ర్‌
Advertisement

Pawan Sagar:టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను మొగ‌లి రేకులు సీరియ‌ల్‌ల‌క్ష ఆర్‌.కెగా న‌టించి మెప్పించిన సాగ‌ర్ క‌లిశారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసి ఆయ‌న‌కు మొక్క‌ను ఇస్తున్న ఫొటోను సాగ‌ర్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ‘పవర్‌ఫుల్ లీడ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ను ఈరోజు క‌లిశాను. ఈరోజును ఎంతో అద్భుతంగా మొద‌లు పెట్టాను. ఆయ‌న ఎంతో విన‌య‌పూర్వ‌క‌మైన వ్య‌క్తి. ఆయ‌న‌తో కొంత స‌మ‌యం గ‌డ‌ప‌టం అనేది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అంటూ మెసేజ్ కూడా షేర్ చేశాడు సాగ‌ర్‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను సాగ‌ర్ క‌ల‌వ‌టంపై ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇద్ద‌రికీ తాము ఫ్యాన్స్‌గా మారిపోయామంటూ త‌మ ఆనందాన్ని కామెంట్స్ రూపంలో వారు తెలియ‌జేశారు. అయితే ఇక్క‌డ మ‌రో వార్త జ‌న‌రేట్ అయ్యింది. అదేంటంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీలో సాగ‌ర్ జాయిన్ అవుతున్నార‌ని. ప్ర‌స్తుతం సాగ‌ర్ సినిమాల‌కు కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయ‌న జ‌న‌సేన పార్టీలో చేరి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌బోతున్నారంటూ వార్త‌లు వినిపించాయి.

Advertisement

మొగ‌లి రేకులు సీరియ‌ల్ ద్వారా ఆర్‌.కె.నాయుడు పాత్ర‌లో న‌టించ‌టం ద్వారా సాగ‌ర్‌కి తిరుగులేని క్రేజ్ ల‌భించింది. కెరీర్ ప్రారంభంలో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ స‌హా కొన్ని చిత్రాల్లో సాగ‌ర్ చిన్న పాత్ర‌లు చేశారు. త‌ర్వాత సీరియ‌ల్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. త‌ర్వాత సిద్ధార్థ అనే సినిమాలో హీరోగానూ న‌టించారు. రెండేళ్ల ముందు షాదీ ముబార‌క్ సినిమాలో న‌టించారు సాగ‌ర్‌. ఇప్పుడు కొన్నాళ్లుగా సినిమాల్లో ఆయ‌న క‌నిపించ‌టం లేదు. సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు.

Rana Naidu:‘రానా నాయుడు’ కోసం వెంక‌టేష్‌, రానా భారీ రెమ్యూనరేషన్స్

Advertisement

Taraka Ratna: ఒకేరోజు 9 సినిమాలకు సంతకం.. తారకరత్న కెరీర్ సాగిందిలా..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×