BigTV English

Changes in Space : నక్షత్రాల ఏర్పాటుతో అంతరిక్షంలో మార్పులు..

Changes in Space : నక్షత్రాల ఏర్పాటుతో అంతరిక్షంలో మార్పులు..
Changes in space

Changes in space : నక్షత్ర మండలంలో జరిగే మార్పులను గుర్తించడానికి ఇప్పటికే ఎన్నో శాటిలైట్లు, స్పేస్ షిప్స్ అంతరిక్షంలో ప్రయాణిస్తున్నాయి. వాటి వల్ల వచ్చే సమాచారంతోనే భూమిపైన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇక అలాంటి పరిశోధనలకు కొత్త ఊపునివ్వడానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది తయారు చేశారు శాస్త్రవేత్తలు. దాని సాయంతో తాజాగా వారు ఒక కొత్త విషయాన్ని గమనించారు.


ఇప్పటికే నక్షత్ర మండలంలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయని టెలిస్కోప్ ద్వారా గుర్తించారు శాస్త్రవేత్తలు. అంతే కాకుండా భూమికి దగ్గరగా ఉన్న గ్యాలక్సీలలో గ్యాస్, దుమ్ము లాంటివి కూడా ఉన్నాయని నాసా తయారు చేసిన జేమ్స్ వెబ్ టెలిస్కాప్ ద్వారా తెలిసింది. అంతే కాకుండా ఆ టెలిస్కోప్ ద్వారా గ్యాస్, దుమ్ము తయారీ సమయంలోని ఫోటోలు కూడా వారి చేతికి చిక్కాయి. దీంతో పాటు గ్యాలక్సీలో కొత్త నక్షత్రాల ఏర్పాటు సమయంలో జరిగే మార్పులను కూడా వారు గమనించారు.

స్పేస్ యూనివర్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త నక్షత్రాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అయితే ఇవి తయారవుతున్న సమయంలో జరిగే మార్పులను తాజాగా శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా గమనించారు. నక్షత్రాలు చిన్నగానే ఉన్నా కూడా వాటి ఏర్పాటు గ్యాలక్సీ, గ్రహశకలాలపై పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వెబ్ టెలిస్కోప్ నుండి వచ్చే సమాచారాన్ని స్టడీ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 100 మంది శాస్త్రవేత్తలు ఒక్కచోట చేరారు.


100 మంది శాస్త్రవేత్తలతో ఏర్పాటయిన టీమ్.. సంవత్సరం నుండి వెబ్ టెలిస్కోప్ అందించిన సమాచారాన్ని స్టడీ చేశారు. అందులో కొన్ని విషయాలు వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. చిన్న నక్షత్రాలు ఏర్పాటయ్యేటప్పుడు.. అవి తమ చుట్టూ ఉన్న గ్యాస్‌ను ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయో డైరెక్ట్‌గా చూశామని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అయితే ఈ కోణంలో మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి పరిశోధనలు చేపట్టాలని ఈ టీమ్ నిర్ణయించుకుంది.

Water Problems : నీటి సమస్యలను దూరం చేసే కొత్త మార్గం..

Depression : డిప్రెషన్‌ను గుర్తించే క‌త్రిమ మేధస్సు..

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×