E-Paper
Advertisement

Ram Charan: బాబాయ్ తో అబ్బాయ్.. ఎన్నిరోజులు అయ్యింది ఈ ఫ్రేమ్ చూసి..

Ram Charan: బాబాయ్ తో అబ్బాయ్.. ఎన్నిరోజులు అయ్యింది ఈ ఫ్రేమ్ చూసి..
Advertisement

Ram Charan: పిఠాపురం హోరెత్తిపోతుంది. ఇప్పటికే పిఠాపురం పవన్ నివాసం మాత్రమే కాకుండా సెలబ్రిటీ హట్ గా మారిపోయింది. ఇక ఈరోజు పిఠాపురం ఒక చిన్నపాటి సంద్రంగా మారింది. అందుకు కారణం నేడు పిఠాపురానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రావడమే. రామ్ చరణ్, అతని తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్ ఉదయాన్నే పిఠాపురం చేరుకున్నారు. అక్కడ కుక్కుటేశ్వర ఆలయంలో సురేఖ పూజలు చేయనున్నారు.

ఇక దీనికన్నా ముందు చరణ్ పిఠాపురంలో అడుగుపెట్టగానే పవన్ నివాసానికి వెళ్ళాడు. అక్కడ బాబాయ్ పవన్ ను కలిసి కొద్దిసేపు ముచ్చటించాడు. వీరిద్దరూ కలిసి ప్రజలకు అభివాదం చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. చాలాకాలం తరువాత బాబాయ్- అబ్బాయ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ భుజాన చెయ్యి వేసి పవన్ అభిమానులకు అభివాదం చేసిన తీరు అక్కట్టుకుంటుంది. పవన్ కు అండగా మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఉంటుంది అని అందరికి తెలుసు.

Advertisement

చరణ్ సైతం తన బాబాయ్ కు ఎప్పుడు సపోర్ట్ ఉంటూనే వస్తున్నాడు. ఇక కొద్దిసేపటిలో చరణ్ జనసేన ప్రచారంలో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇక చరణ్ ను చూడడానికి పిఠాపురం పోటెత్తింది. పవన్ ఇంటివద్ద జన సందోహం సంద్రంలా మారింది. పవన్ ను గెలిపించడానికి చరణ్ ప్రచారం చేస్తున్నాడు అని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఇక చరణ్ సినిమా కెరీర్ గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×