BigTV English

Rahul Gandhi: భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి రాజశేఖర్ రెడ్డి పాదయాత్రే.. కడప బహిరంగసభలో రాహుల్

Rahul Gandhi: భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి రాజశేఖర్ రెడ్డి పాదయాత్రే.. కడప బహిరంగసభలో రాహుల్

Rahul Gandhi Speech In Kadapa: భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాజీవ్ గాంధీ అమరత్వం పొందాక తనకు రాజశేఖర్ రెడ్డి మార్గదర్శకులయ్యారని రాహుల్ వెల్లడించారు. కడప బహిరంగసభలో పాల్గొన్న రాహుల్ గాంధీ రాజశేఖర్ రెడ్డి గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ తన తండ్రికి సోదరుడు వంటివారని తెలిపారు.


అందరికీ నమస్కారం.. వైఎస్సార్ జోహార్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేసిన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రేనని స్పష్టం చేశారు. పాదయాత్ర చేస్తేనే ప్రజల బాధలు తెలుస్తాయన్న రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం ప్రకారమే జోడో యాత్ర చేశానని రాహుల్ తెలిపారు. భారత్ జోడో యాత్ర ద్వారా విద్వేషపు వీధుల్లో ప్రేమ దుకాణాలు ప్రారంభించానంటే అందుకు కారణం రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన స్పూర్తేనని తేల్చి చెప్పారు. కానీ ప్రస్తుతం ఏపీలో రాజన్న పాలన కనిపించడంలేదంటూ వాపోయారు.

రాజశేఖర్ రెడ్డి ఢిల్లీలో ఏపీ ఆలోచనలు ప్రతిధ్వనించేవాని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ప్రస్తుతం జగన్ బీజేపీ కి బీ టీమ్ గా వ్వవహరిస్తున్నారని అన్నారు. బీజేపీకి సరికొత్త నిర్వచనాన్నిచ్చారు రాహుల్. బీ అంటు బాబు.. జే అంటే జగన్.. పీ అంటే పవన్ అని చెప్పారు. కానీ రిమోట్ కంట్రోల్ మాత్రం మోదీ దగ్గర ఉందని పేర్కొన్నారు. అసలు జగన్‌‌కు బీ టీమ్ గా ఎందుకు వ్వవహరిస్తున్నారో రాహుల్ తెలిపారు. మోదీ దగ్గర ఈడీ, సీబీఐ వంటి ఆయుధాలున్నాయని.. అందుకే జగన్ బీ టీమ్ గా ఉన్నారని ఎద్దేవా చేశారు.


ఆంధ్ర ప్రజల బాధలు ఢిల్లీలో అణచివేశారని.. రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవని.. కానీ జగన్ బీజేపీని ఒక్క మాట కూడా అనరని అన్నారు. ఇక చంద్రబాబు పరిస్థితి కూడా అదేనని.. వీరి మీద కేసులున్నాయని అందుకే మోదీని ప్రశ్నించే సాహసం చేయరన్నారు. పదేళ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు.. విభజన చట్టంలో వాగ్థానాలిచ్చామని గుర్తుచేశారు.

Also Read: కాంగ్రెస్ పార్టీ కూడా తప్పులు చేసింది.. తప్పకుండా మార్చుకుంటాం: రాహుల్ గాంధీ

కానీ కేంద్రంలో పదేళ్లు బీజేపీ అధికారంలో ఉందని విభజన చట్టంలో పేర్కొన వాగ్థానాలు అలానే ఉన్నాయన్నారు రాహుల్ గాంధీ. ప్రత్యేక హోదా వచ్చిందా.. పోలవరం పూర్తయిందా.. కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విభజన చట్టంలో ఉన్న వాగ్థానాలన్ని పూర్తి చేస్తామన్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిల లోక్ సభలో ఉండాలని.. కడప ఓటర్లు షర్మిలను గెలిపించి పార్లమెంట్‌కు పంపాలని కోరారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×