BigTV English

R. Narayana Murthy: బ్రేకింగ్.. పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తికి అస్వస్థత

R. Narayana Murthy: బ్రేకింగ్.. పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తికి అస్వస్థత

R. Narayana Murthy: సినీ నటుడు, పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి హాస్పిటల్ లో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన అస్వస్థతకు గురికావడంతో వెంటనే పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్లో చేర్చినట్లు సమాచారం. వైద్యులు ఆయనను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.


డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.  ఆర్ నారాయణమూర్తి సన్నిహితులు ఈ విషయం తెలపడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయనకు ఏమైంది.. ? ఎలా ఉన్నారు.. ? అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అసలు నారాయణమూర్తి ఆరోగ్యానికి ఏమైంది అనే విషయం ఇంకా తెలియలేదు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఆర్ నారాయణమూర్తి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విప్లవాత్మక సినిమాలు తీయడంలో ఆయనది అందెవేసిన చేయి. పేదలను ప్రభుత్వాలు ఎలా దోచుకుంటున్నాయి.. ? పేదలు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు. ఇలాంటివి ఆయన తన సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అలాంటి సినిమాలు తీయడంతో ఆయనను పీపుల్ స్టార్ అని గౌరవంగా పిలుచుకుంటారు.


ఒకప్పుడు యాక్టివ్ గా సినిమాలు చేసే ఆయన .. ప్రస్తుతం సినిమాలను తగ్గించేశారు. అప్పుడప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. మరి ఆర్ నారాయణమూర్తి హెల్త్ అప్డేట్ తెలియాలంటే కొద్దిసేపు ఆగాల్సిందే.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×