BigTV English

Deputy CM Bhatti: ఆందోళన వద్దు.. అందరికి రుణమాఫీ

Deputy CM Bhatti: ఆందోళన వద్దు.. అందరికి రుణమాఫీ
Advertisement

Farm Loan Waiver: ఆగస్టు నెల దాటకుండనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రేపు సాయంత్రం రూ. 1 లక్షలోపు రుణాలు మాఫీ అవుతాయని, నెలాఖరు వరకు లక్షన్నర రుణాలను మాఫీ చేస్తామని వివరించారు. వచ్చే నెలలో రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ విషయంలో రుణాలు తీసుకున్న రైతులు ఆందోళన చెందవద్దని, అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. రేషన్ కార్డులేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని, ఎవరినీ వదలబోమని, మాట అనే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ రుణమాఫీ కోసం నిద్రలేని రాత్రులు గడిపామని చెప్పారు. రూపాయి రూపాయి కూడబెట్టి రుణమాఫీ చేస్తున్నామని వివరించారు.


మిగులు బడ్జెట్‌లో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్ష రూపాయాల రుణమాఫీ కోసం రూ. 25 వేల చొప్పున నాలుగు దఫాలుగా విడుదల చేసి పూర్తి చేసిందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి గుర్తు చేశారు. ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలల వ్యవధిలోనే రూ. 2 లక్షల రుణమాఫీని చేపడుతున్నదని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. అనుకున్న స్థాయిలో ఈ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదని వివరించారు.

పార్లమెంటు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే అంతా ఆశ్చర్యపోయారని భట్టి గుర్తు చేశారు. ఓట్ల కోసమే సీఎం హామీలు ఇస్తున్నారని, ఎన్నికల సవాల్ అని అనుకున్నారని తెలిపారు. కానీ, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రూపాయి రూపాయి పోగు చేసి రుణమాఫీని అమలు చేయబోతున్నామని తెలిపారు.


Also Read: రేపు సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని రైతులకు, ప్రజలకు వివరించి వారి హృదయాలు గెలువాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూతు, ప్రతి ఓటర్ దగ్గరకు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని, తల ఎత్తుకుని ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేయండని చెప్పారు. ఇది కాంగ్రెస్ నేతలు అందరికీ ఉపయోగపడే కార్యక్రమం అని వివరించారు.

ప్రజాభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులతో సీఎం, డిప్యూటీ సీఎంలు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. రేపు సాయంత్రం 4 గంటలకు రూ. 1 లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని వివరించారు.

Related News

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఏంటీ బీఆర్ఎస్ లైట్ తీసుకుందా..?

Konda Surekha: భట్టితో మంత్రి కొండా సురేఖ భేటీ.. సెక్యూరిటీ లేకుండానే..?

NMMS: విద్యార్థులకు అద్భుతమైన అవకాశం.. రూ.48,000 స్కాలర్‌షిప్ గడువు పొడగింపు, ఇంకెందుకు ఆలస్యం

Shabbir Ali Comments: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్..

Jubilee Hills Bypoll: జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ కేడర్ మద్దతు ఎవరికి?

Telangana News: బీసీ రిజర్వేషన్ల అంశం.. ఎస్ఎల్‌పీ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరణ, పాత పద్దతిలో ఎన్నికలు?

Telangana politics: మీనాక్షి నటరాజన్ దగ్గరకు కొండా సురేఖ..

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. నేతల మధ్య మాటల యుద్ధం, కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Big Stories

×