BigTV English

Poorna:- మ‌హిళ‌గా నా జీవితం ప‌రిపూర్ణ‌మైంది.. పూర్ణ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Poorna:- మ‌హిళ‌గా నా జీవితం ప‌రిపూర్ణ‌మైంది.. పూర్ణ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Poorna:- న‌టి పూర్ణ త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన చేసిన పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇంత‌కీ ఆమె చేసిన పోస్ట్ దేనికి సంబంధించిందో తెలుసా!.. రీసెంట్‌గా పూర్ణ పండంటి బాబుకి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. మార్చి 4న దుబాయ్‌లోని ఏస్ట‌ర్ హాస్పిట‌ల్‌లో పూర్ణ డెలివ‌రీ జ‌రిగింది. ఆ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఆమె ఫొటోల‌ను కూడా షేర్ చేసింది. ఇప్పుడు ఆమె మ‌రోసారి త‌న మాతృత్వానికి సంబంధించి మ‌రో పోస్ట్ పెట్టింది. ఈసారి అందులో ఆమె ఓ వీడియోను షేర్ చేసుకుంది. అందులోపూర్ణ గ‌దిని బెలూన్స్‌తో అందంగా ముస్తాబు చేసి గోడ‌పై బేబీ బాయ్ అని రాసి ఉన్నారు. ఆప‌రేష‌న్ రూమ్ నుంచి ఆమెను గ‌దిలోకి తీసుకొచ్చారు. ఆ స‌మ‌యంలో పూర్ణ క‌ళ్ల‌లో ఆనందంతో క‌న్నీళ్లు తిరిగాయి. ఈ అనుభూతిని ఆమె త‌న పోస్ట్‌లో షేర్‌చేసుకున్నారు.


‘మా అమ్మ అంటే నాకెంతో ఇష్టం. ఆమె నా ప్ర‌పంచం. ఇప్పుడు నేను త‌ల్లిన‌య్యాను. ఈ ఫీలింగ్‌ గురించి మాట‌ల్లో చెప్ప‌లేను. నా అనుభూతి ఒక‌టే. మ‌హిళ‌గా నా జీవితం ప‌రిపూర్ణ‌మైంది. మ‌రోసారి అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను’ అని పేర్కొన్నారు పూర్ణ‌. కేర‌ళ‌కు చెందిన పూర్ణ అస‌లు పేరు ష‌మ్నా కాసిం. 2004లో ఆమె న‌టిగా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ప్రారంభంలో మలయాళంలో సినిమాలు చేశారు. శ్రీమహాలక్ష్మి చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. అవును, అవును 2, సీమ టపాకాయ్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. హీరోయిన్‌గానే కాకుండా ప‌లు చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లోనూ ఆమె న‌టించి ఆక‌ట్టుకున్నారు.

కింద‌టేడాది యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌కు చెందిన బిజినెస్ మేన్ షానిద్ అసిఫ్ అలీని పూర్ణ వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్ల‌కే ఆమె గ‌ర్భ‌వ‌తిన‌ని ప్ర‌క‌టించ‌డంతో ఆమె పెళ్లికి ముందే షానిద్‌తో డేటింగ్‌లో ఉన్నార‌ని అర్థ‌మైంది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×