BigTV English
Advertisement

Movies : ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే..!

Movies : ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే..!

Movies : వేసవిలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్ లో మూవీలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు అయిపోయాయి. ఈ వారంలోనే టెన్త్ ఎగ్జామ్స్ పూర్తవుతున్నాయి. దీంతో పిల్లలతో కలిసి పెద్దలు థియేటర్లకు క్యూకట్టనున్నారు. దీంతో ఈ వారం థియేటర్లలో పలు చిత్రాలు ప్రేక్షకులను వినోదాన్ని అందించేందుకు వచ్చేస్తున్నాయి.


శాకుంతలం..
సమంత కీలక పాత్రలో నటించిన ‘శాకుంతలం’ మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. 3డీ వెర్షన్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల – దుష్యంతుల ప్రేమకావ్యం ఆధారంగా గుణశేఖర్‌ ఈ మూవీని తెరకెక్కించారు. శాకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్‌మోహన్‌ నటించారు. ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం అదనపు బలం.

రుద్రుడు..
రాఘవ లారెన్స్‌ హీరోగా కతిరేశన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం రుద్రుడు. ప్రియా భవానీ శంకర్‌ కథానాయిక. శరత్‌ కుమార్‌, పూర్ణిమ భాగ్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇతర భాషల్లో విడుదలై విజయవంతమైన చిత్రాలను కాస్త ఆలస్యంగానైనా తెలుగు ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు. అలా ఈ వారం విడుదల కాబోతున్న పీరియాడిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘విడుదల : పార్ట్‌-1. సూరి, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వెట్రిమారన్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల తమిళంలో విడుదలై విమర్శకులను సైతం మెప్పించింది. ఏప్రిల్‌ 15న ఈ మూవీ తెలుగులో విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు /వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌..
ఫ్లోరియా మాన్‌ (వెబ్‌సిరీస్) ఏప్రిల్‌ 13
అబ్సెషన్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 13
క్వీన్‌ మేకర్‌ (కొరియన్‌ సిరీస్‌) ఏప్రిల్‌ 14
ది లాస్ట్‌ కింగ్‌డమ్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 14

అమెజాన్‌ ప్రైమ్..
ది మార్వెలస్‌ మిస్సెస్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 14

జీ5..
మిస్సెస్‌ అండర్‌కవర్‌ (హిందీ) ఏప్రిల్‌ 14

డిస్నీ+హాట్‌స్టార్‌..
టైనీ బ్యూటిఫుల్‌ థింగ్స్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 9
ఓ కల (తెలుగు) ఏప్రిల్‌ 13

ఆహా..
దాస్‌ కా ధమ్కీ.. ఏప్రిల్‌ 14

ఈటీవీ విన్..
అసలు.. ఏప్రిల్ 13

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×