E-Paper
Advertisement

Posani Murali Krishna : కొండా సురేఖ వివాదంపై స్పందించని బాలయ్య… పోసాని షాకింగ్ కామెంట్స్

Posani Murali Krishna : కొండా సురేఖ వివాదంపై స్పందించని బాలయ్య… పోసాని షాకింగ్ కామెంట్స్
Advertisement

Posani Murali Krishna : అక్కినేని ఫ్యామిలీ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఆమె చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ మొత్తం ఏకమై ఖండించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని వెంకటేష్, నాగార్జున, తారక్, ప్రభాస్, మహేష్, బన్నీ తదితరులు ఆమె వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ బాలయ్య మాత్రం ఇప్పటిదాకా ఈ వివాదంపై పెదవి విప్పలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ బాలయ్య పై సెటైర్లు వేశారు.

బాలయ్య పై పోసాని సెటైర్లు

Advertisement

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ కొండా సురేఖ అలాంటి కామెంట్స్ ఎందుకు చేసిందో ఆమె ఆలోచించుకోవాలని అన్నారు. పొరపాటున నోరు జారినప్పటికీ ఆమె చేసిన కామెంట్స్ భరించరానివి అని, అలా మాట్లాడి ఉండకూడదని చెప్పుకొచ్చారు. కొండా సురేఖ తనకు 20- 30 ఏళ్ల నుంచి తెలుసని, చాలా మంచి మనిషి, ఎప్పుడూ నవ్వుతూ ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పుకొచ్చిన పోసాని ఆమె చేసిన కామెంట్స్ మాత్రం తప్పని అన్నారు. ఇక ఆమె కామెంట్ చేసిన నాగార్జున చాలా హంబుల్ పర్సన్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పారు. తనకు 40 ఏళ్ల నుంచి నాగార్జున తెలుసని, ఎవ్వరికీ హాని తలపెట్టడని, అలాంటి మంచి మనిషిని ఆ కామెంట్ చేయడం తప్పని పేర్కొన్నారు. అలాగే రకుల్ ప్రీత్ గురించి ప్రస్తావిస్తూ పెళ్లి చేసుకుని ఎక్కడో ముంబైలో ఉంటున్న ఆ అమ్మాయి గురించి మీరు అన్న మాటలు కరెక్ట్ కాదని గుర్తు చేశారు. అంతేకాకుండా ‘నాగార్జున సోదర సమానుడు, ఏదో ఆవేశంలో అన్నాను, ఎక్స్ట్రీమ్లీ సారి’ అంటూ చెప్తే వివాదం సమసిపోతుందంటూ సలహా ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే బాలయ్య ఈ వివాదం గురించి స్పందించలేదని ప్రస్తావించగా, పోసాని మాట్లాడుతూ ‘బాలకృష్ణ ఖండించాడా ఖండించలేదా అనే విషయాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ద గ్రేట్ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిస్తేనే వాళ్ళ నాన్న కోసం ఖండించలేదు. నాగార్జున విషయాన్ని ఖండిస్తాడా?’ అంటూ తిరిగి ప్రశ్నించారు. మరి మహిళలపై ఇలా కామెంట్ చేస్తే ఖండించాలి కదా? అని ప్రశ్నించగా ‘మహిళల గురించి ఆయన ఏమన్నాడు? ముద్దు పెట్టుకోవాలి, కడుపు చేయాలి అన్నాడు’ అంటూ గతంలో బాలకృష్ణ నోరు జారిన విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం పోసాని బాలయ్యపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

100 కోట్ల దావా వేస్తానన్న నాగ్

Advertisement

ఇక తాజాగా నాగార్జున కొండా సురేఖ క్షమాపణ చెప్పినా సరే తగ్గేదే లేదు సంచలన కామెంట్స్ చేశారు.. ఇప్పటికే ఆయన సురేఖపై కేసు ఫైల్ చేయగా, ఆమె సమంతకు ఒక క్షమాపణలు చెప్తే సరిపోతుందా ? మరి నా కుటుంబం సంగతేంటి ? అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×