BigTV English

Prabhas 25 : ప్ర‌భాస్ ‘స్పిరిట్’… ఇద్దరు ముద్దుగుమ్మలతో డార్లింగ్ సయ్యాట!

Prabhas 25 : ప్ర‌భాస్ ‘స్పిరిట్’… ఇద్దరు ముద్దుగుమ్మలతో డార్లింగ్ సయ్యాట!

Prabhas 25 : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్టుల‌ను లైన్‌లో పెట్టారు. జ‌యాప‌జ‌యాల‌ను ప‌క్క‌న పెడితే, డార్లింగ్ లైన్లో పెట్టిన ప్రాజెక్ట్స్ మాత్రం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆది పురుష్ సినిమాను పూర్తి చేసిన ప్ర‌భాస్‌.. ఇప్పుడు రెండు భారీ చిత్రాల‌ను కంప్లీట్ చేయ‌టంలో బిజీగా ఉన్నారు. అవే స‌లార్‌, ప్రాజెక్ట్ K చిత్రాలు. వీటితో పాటు మారుతి సినిమాను కూడా ప్ర‌భాస్ సైలెంట్‌గా పూర్తి కానిచ్చే ప‌నిలో ఉన్నారు. ప్ర‌భాస్ ఇంత గ్యాప్ లేకుండా వ‌రుస సినిమాల‌ను ఎందుకు చేస్తున్నార‌నే సందేహం రాక మాన‌దు. ఎందుకంటే నెక్ట్స్ ఇయ‌ర్‌ ప్ర‌భాస్ మ‌రో క్రేజీ ప్రాజెక్టులో న‌టించాల్సి ఉంది. అదే స్పిరిట్‌. ప్ర‌భాస్ కెరీర్ మైల్‌స్టోన్ 25వ చిత్రంగా స్పిరిట్ రూపొంద‌నుంది. అర్జున్ రెడ్డితో ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు సందీప్ వంగా ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం సందీప్ … బాలీవుడ్ ప్రాజెక్ట్ యానిమ‌ల్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రో వైపు స్పిరిట్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌పై కూడా ఫోక‌స్ చేశార‌ట‌. అందులో భాగంగా స్పిరిట్ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్‌ను మేక‌ర్స్ తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ఆ ఇద్దరు హీరోయిన్స్‌లో ఒక‌రు బాలీవుడ్.. మ‌రొక‌రు టాలీవుడ్‌కి చెందిన హీరోయిన్స్‌గా ఉంటార‌నే టాక్ గ‌ట్టిగా వినిపిస్తోంది. ప్ర‌భాస్ తాజా పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ వ‌చ్చే ఏడాది జూన్ 16న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనికి ఓం రౌత్ ద‌ర్శ‌కుడు.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×