BigTV English

Prabhas Spirit: ‘స్పిరిట్’లో ప్ర‌భాస్‌ను ఢీ కొట్టే పాత్రలో మార్వెల్ యూనివ‌ర్స్‌ యాక్ట‌ర్‌.. సందీప్ వంగా ప్లాన్ అదుర్స్..!

Prabhas Spirit: ‘స్పిరిట్’లో ప్ర‌భాస్‌ను ఢీ కొట్టే పాత్రలో మార్వెల్ యూనివ‌ర్స్‌ యాక్ట‌ర్‌.. సందీప్ వంగా ప్లాన్ అదుర్స్..!

Prabhas Spirit: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మానియా బాక్సాఫీసు వద్ద కొనసాగుతోంది. దాదాపు 10 రోజుల్లో ఈ సినిమా రూ.800 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టి దుమ్ముదులిపేసింది. మైథాలజీ కాన్సెప్ట్ యాక్షన్‌ సన్నివేశాలతో సూపర్ హీరో సినిమాగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ ఓ రేంజ్‌లో అదరగొడుతోంది. ఇందులో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వంటి స్టార్ నటీ నటులు ప్రధాన పాత్రల్లో నటించి అదరగొట్టేశారు. అలాగే రాజమౌళి, ఆర్జీవీ, బ్రహ్మానందం, అనుదీప్, ఫరియా అబ్దుల్లా, దిశా పటానీ వంటి దర్శకులు, నటీమణులు గెస్ట్ రోల్‌లో కనిపించి అదరగొట్టేశారు.


దీంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయిందనే చెప్పాలి. ఇక త్వరలో ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మూవీ థియేటర్లలో మాస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న క్రమంలో త్వరలో ప్రభాస్ నటించబోయే మరొక కొత్త సినిమాకు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ తన తదుపరి సినిమాను ‘యానిమల్’ ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోతున్నాడు.

స్పిరిట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే దర్శకుడు సందీప్‌ ఇటీవల తెరకెక్కించిన ‘యానిమల్’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో సందీప్ నెక్స్ట్ మూవీ ప్రభాస్‌తో ఉండటంతో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే తాజాగా ఈ స్పిరిట్ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ బయటకొచ్చి బాగా వైరల్ అవుతోంది.


Also Read: ప్రభాస్ ‘స్పిరిట్’ అప్డేట్.. అభిమానులకు పండగే ఇక..!

ప్రభాస్ స్పిరిట్ సినిమాలో విలన్‌గా హాలీవుడ్ మార్వెల్ యూనివర్స్‌కు చెందిన స్టార్ యాక్టర్‌ను సందీప్ రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్‌ను ఢీ కొట్టే పాత్రలో కొరియన్ నటుడు మా డాంగ్ సియోక్ నటించబోతున్నట్లు సమాచారం. నటుడు మా డాంగ్ సియోక్‌కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. పలు సౌత్ కొరియన్ మూవీలతో సహా హాలీవుడ్‌ మూవీల్లో కీలక పాత్రల్లో అదరగొట్టేస్తుంటాడు.

హాలీవుడ్‌లో పలు సినిమాలలో హీరోగా చేస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు మా డాంగ్. ఇలా కొరియన్ సినిమాలతో పాటు హాలీవుడ్‌లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రిలీజ్ అయిన ది ఎటర్నల్స్ సినిమాలో సూపర్ హీరోగా కనిపించి దుమ్ముదులిపేశాడు. ఇక ఇప్పుడు ఈ కొరియన్ యాక్టర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ స్పిరిట్ మూవీలో విలన్‌గా నటించబోతున్నట్లు తాజాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ యాక్టర్ వీకీపీడియా పేజీలో స్పిరిట్‌లో నటిస్తున్నట్లు కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయింది. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×