BigTV English
Advertisement

Prabhas – Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ అప్డేట్.. అభిమానులకు పండగే ఇక..!

Prabhas – Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ అప్డేట్.. అభిమానులకు పండగే ఇక..!

Prabhas – Spirit : ప్రభాస్.. ఈ పేరు వినగానే సినీ అభిమానుల్లో ఏదో తెలియని ఉత్సాహం. ఆయన సినిమాలంటే పిచ్చి. మరి అలాంటి ప్రభాస్ ఇప్పుడు పలు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అందులో స్పిరిట్ ఒకటి. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కబోతుంది. ‘యానిమల్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకొని బాక్సాఫీసును షేక్ చేసి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించడంతో యావత్ సినీ ప్రియుల్లో అంచనాలు పెరిగిపోయాయి.


దీంతో ఈ కాంబో నుంచి అప్డేట్‌ల కోసం ఆడియన్స్, ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ మాస్ అండ్ యాక్షన్ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ బయటకొచ్చింది.

Also Read: స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పేసిన వంగా..!


ప్రభాస్ నెక్స్ట్ మూవీ స్పిరిట్ ఈ ఏడాది అక్టోబర్‌లో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రభాస్‌ను ఈ మూవీలో మాస్ అండ్ క్లాస్ లుక్‌లో ఎన్నడూ చూడనివిధంగా దర్శకుడు సందీప్ చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒకెత్తయితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రంలో ప్రభాస్‌ను రెండు డిఫరెంట్ లుక్స్‌లో చూపించనున్నట్లు ఫుల్ టాక్ నడుస్తోంది.

అందులో ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రగ్గడ్ అండ్ వైల్డ్ లుక్‌లో కనిపించనున్నాడట. అలాగే మరో సెకండ్ లుక్‌లో ప్రభాస్ చాలా క్లాసిక్‌గా స్టైలిష్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యానిమల్స్‌లో రణ్ బీర్ ఎన్ని షేడ్స్‌లో కనిపించాడో.. అంతకంటే మరింత షేడ్స్‌లో ప్రభాస్‌ను చూపించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. దీంతో ఈ మూవీపై హైప్ అంతకంతకు రెట్టింపు వేగంతో దూసుకుపోతుంది. కాగా ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×