E-Paper
Advertisement

Salaar Hungama: సలార్ రిలీజ్.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా

Salaar Hungama: సలార్ రిలీజ్.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా
Advertisement

Salaar Hungama: రెబల్ స్టార్‌ ప్రభాస్‌ సలార్‌.. మూవీ మానియాతో తెలుగు రాష్ట్రాలు ఊగిపోతున్నాయి. భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. సినిమా బెనిఫిట్ షో లకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఫ్యాన్స్ ఊర మాస్ సెలబ్రేషన్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీమియర్‌ షోలు పడటంతో ప్రేక్షకుల అరుపులు, కేకలతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. సినిమా సూపర్‌ హిట్‌ అంటూ కొందరు టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 7వేల థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశ వ్యాప్తంగా కూడా మంచి బజ్ ఏర్పడింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షో లను అనుమతులు ఇవ్వడంతో.. ప్రభాస్ మాస్ సంభవం అంటూ నిన్న రాత్రి నుంచే ఫ్యాన్స్ అంతా దుమ్ము లేపే రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. థియేటర్ల వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని డప్పులతో మోత మోగిస్తూ.. టపాసులు పేలుస్తూ సెలబ్రేషన్స్ చేస్తున్నారు.

Advertisement

బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ మిగల్చడంతో అభిమానులంతా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ప్రీమియర్స్‌ చూసిన ప్రేక్షకులు పాజిటివ్‌ టాక్‌తో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.

కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. రవి బర్సూర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా.. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్థాయిలో రిలీజ్‌ చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×