BigTV English

Singareni Elections: BRSకి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం షాక్.. మూకుమ్మడి రాజీనామా

Singareni Elections: BRSకి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం షాక్.. మూకుమ్మడి రాజీనామా

Singareni Elections: సింగరేణి ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తీసుపోని ఉత్కంఠ సింగరేణి ఎన్నికలపై కొనసాగుతోంది. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న యథావిధిగా నిర్వహించుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. వాయిదా వేయాలన్న ఇంధనశాఖ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మధ్యంతర పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.


మొన్నటివరకు సింగరేణి ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగగా.. హైకోర్టు తీర్పుతో ఎట్టకేలకు దానికి తెరపడింది. ఇక ఈనెల 27 న ఎన్నికలు సజావుగా జరుగుతాయనుకున్న సమయంలో మళ్లీ మరో చిక్కొచ్చిపడింది. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే BRS పార్టీకి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం షాకిచ్చింది. యూనియన్‌కు చెందిన ముగ్గురు టాప్ లీడర్లు రాజీనామా చేశారు. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయవద్దని గులాబి పెద్దలు ఆదేశించడంతో.. యూనియన్ నేతలు ఈ నిర్ణయానికి వచ్చారు. BRS నిర్ణయంతో యూనియన్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లోనే పోటీ చేయనప్పుడు.. యూనియన్‌లో ఎందుకుండాలంటూ మూకుమ్మడిగా రాజీనామా చేశారు.

రాజీనామే సరైన నిర్ణయం అని అధ్యక్షులు వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగేర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి భావిస్తున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకి పోటీ చేయవద్దని ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ చెప్పడంతో యూనియన్ నాయకులు నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది.


.

.

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×