E-Paper
Advertisement

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?
Advertisement

Prabhas – Hanu.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింప తెచ్చుకున్న ప్రభాస్ (Prabhas ) రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి (Bahubali) సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తెచ్చి పెట్టిన ఇమేజ్ తో అన్నీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్న ప్రభాస్ కల్కి 2898AD సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

సెలెక్టివ్ గా కథలు ఎంపిక చేసుకుంటున్న ప్రభాస్..

Advertisement

మరోవైపు సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే సలార్ 2, కల్కి 2, స్పిరిట్, రాజా సాబ్ చిత్రాలతో పాటు సీతారామం సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu raghavapudi) తో కూడా ఒక సినిమా ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు రహస్యంగా జరుగుతున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో వస్తున్న రాజాసాబ్ సినిమా షూటింగ్లో బిజీగా పాల్గొంటున్నారు ప్రభాస్. ఈ సినిమాను వచ్చే సమ్మర్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నారు.

రహస్యంగా హాను రాఘవపూడి తో మూవీ..

Prabhas - Hanu : Gup chup shooting... why so secret..?
Prabhas – Hanu : Gup chup shooting… why so secret..?
Advertisement

అయితే మరోపక్క హను రాఘవపూడి తో కూడా సినిమాను రహస్యంగా, వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారట ప్రభాస్. ఈ విషయం తెలిసి ఇంత రహస్యంగా ఎందుకు సినిమా షూటింగ్ చేస్తున్నారు అంటూ అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్లో.. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయినట్లు సమాచారం. మధురైలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఇకపోతే ప్రభాస్ మాత్రం సెట్ లో లేడు అని, ఆయన రాజాసాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు అని సమాచారం. అక్కడ షెడ్యూల్ పూర్తయిన తర్వాతే హను సినిమా సెట్ లోకి అడుగు పెడతారట. ప్రస్తుతం మధురై షెడ్యూల్లో ప్రభాస్ పై తెరకెక్కించే సన్నివేశాలు ఏవి లేవు కాబట్టి ఒక వారం రోజులపాటు మదురై లోనే చిత్ర బృందం ఉంటుందని సమాచారం.

పరిశీలనలో ఫౌజీ అనే టైటిల్..

ఇకపోతే 1945 సంవత్సర కాల నేపథ్యంలో సాగే కథ అని, ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం . ఇక త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా చిత్ర బృందం ప్రభాస్ పై ఒక ఫోటోషూట్ నిర్వహించగా చిన్న గ్లింప్స్ కూడా డిజైన్ చేసి, దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.. ఇందులో మిథున్ చక్రవర్తి ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రభాస్ కి తండ్రి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి అనే కొత్త అమ్మాయికి ఇందులో అవకాశం కల్పించారు. చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తుండగా.. కేకే సాహిత్యాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు కూడా రికార్డు చేసినట్లు సమాచారం.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×