E-Paper
Advertisement

Kalki 2898 AD Another Record: రికార్డుల మీద రికార్డులు.. షారుఖ్‌ను వెనక్కి నెట్టి ప్రభాస్.. ఇదేక్కడి మాస్ రా మావా..!

Kalki 2898 AD Another Record: రికార్డుల మీద రికార్డులు.. షారుఖ్‌ను వెనక్కి నెట్టి ప్రభాస్.. ఇదేక్కడి మాస్ రా మావా..!
Advertisement

Kalki 2898 AD Another Record: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ బాక్సాఫీసు వద్ద ఇంకా దూకుడు ప్రదర్శిస్తోంది. జూన్ 27న ప్రపంచ స్థాయిలో రిలీజ్ అయిన సినిమా ఎన్నో రికార్డులను సైతం కొళ్లగొట్టింది. తాజాగా మరొక రికార్డును కల్కి సినిమా తన ఖాతాలో వేసుకుంది. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డు అంటూ తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా జూన్ 27న రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో ప్రభాస్ లుక్ చూసి ప్రేక్షకులు, అభిమానులు ఫిదా అయిపోయారు. ఇంత వరకు అలాంటి లుక్‌లో ప్రభాస్‌ను చూడలేదని.. ఇప్పుడు ఆ అవకాశాన్ని అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో ప్రభాస్ పాత్రకు ధీటుగా అమితాబ్ బచ్చన్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. వారిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.

Advertisement

ప్రభాస్ – అమితాబ్ బచ్చన్‌ల మధ్య ఫైట్ సీక్వెన్స్‌లో విజువల్ ఎఫెక్ట్స్‌ జోడించిన తీరు అచ్చం హాలీవుడ్ రేంజ్‌లో ఉంటూ సినీ ప్రియుల్ని బాగా అట్రాక్ట్ చేశాయి. సినిమా చూసిన ప్రియులు ఇది టాలీవుడ్ సినిమానా అనేంతలా ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఒక విజువల్ వండర్ సినిమాను టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌కి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేశారు. ఇకపోతే ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము దులిపేస్తుంది. రిలీజ్ అయి దాదాపు మూడు వారాలు అవుతున్నా క్లౌడ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ థియేటర్లలో సెన్సేషనల్ కలెక్షన్లతో అదరగొడుతూ.. రికార్డుల వర్షం కురిపిస్తోంది.

Also Read: 1000 కోట్ల క్లబ్ లో కల్కి.. స్పెషల్ వీడియో.. ప్రభాస్ తేజస్సు చూశారా..? ఎలా మెరిసిపోతుందో..!

Advertisement

కేవలం 2 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టి అబ్బురపరచింది. విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అందుకుని నిర్మాతలకు లాభాల పంట పండించింది. కాగా ప్రస్తుతం పెద్ద సినిమాలేవి లేకపోవడంతో కల్కికి కలిసొచ్చిందనే చెప్పాలి. అందులోనూ ఇటీవల విడుదలైన ఇండియన్ 2 సినిమా కూడా బాక్సాఫీసు వద్ద ఘోరమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో చాలామంది కల్కిపైనే ఆసక్తి చూపించారు. దీంతో కలెక్షన్లు మరింత పుంజుకున్నాయి.

ఇక ఇప్పటికే ఎన్నో రికార్డులను సైతం కొళ్లగొట్టిన ఈ సినిమా తాజాగా మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఓ వైపు కలెక్షన్లలో దుమ్ము దులిపేస్తూ మరో వైపు టికెట్ల సేల్స్‌లో అదరగొడుతోంది. తాజాగా ప్రముఖ టికెట్ల బుకింగ్ యాప్ బుక్‌ మై షోలో కల్కి జూన్ 27 నుంచి జూలై 17 వరకు మొత్తంగా 12.15 మిలియన్ల టికెట్లు సేల్ అయ్యాయి. ఈ విషయాన్ని బుక్ మై షో తాజాగా తెలిపుతూ.. ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డు, బుక్ మై షోలో కూడా సెన్సేషనల్ రికార్డు అని రాసుకొచ్చింది. అయితే బుక్ మై షోలో టికెట్ల బుకింగ్స్‌లో ఇప్పటి వరకు అత్యధిక టికెట్స్ సేల్ అయిన సినిమాగా షారుఖ్ ఖాన్ జవాన్ (12.01 మిలియన్) ఉండగా.. ఇప్పుడు ఆ రికార్డును ప్రభాస్ కల్కి కేవలం 20 రోజుల్లోనే (12.15 మిలియన్) బద్దలు కొట్టి మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×